భారత మీడియాకు సహనం తక్కువే. అనుమానం లేదు ఏవో కొన్ని మీడియా హౌజులకు తప్పించి ఈ రోగం అన్నింటికీ ఉంది. ఏ చిన్న విషయం దొరికినా నిజానిజాల విశ్లేషణ విచారణ లేకుండా ఏదిపడితే అది రాసేయటం ఇక్కడ సహజం. వారతలను తమకు తమపార్టీ వారికి తాము మద్దతిచ్చే అధినేతల పార్టీలకు తగ్గట్లు వారతలు రాయటం అలవాటే. అయితే సంచలనాల కోసం మొహం వాచేలా ఎదురు చూసే వారి కోసం చకా చకా వార్తలు రాసేయటం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే భారత్‌ మీడియా వర్గాలపై దుబాయ్‌ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ దుబాయ్‌ పోలీసులను ఉటంకిస్తూ  శ్రీదేవి మృతిపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. "భారతీయ నటి శ్రీదేవి మృతి అందరినీ షాక్‌కు గురిచేసింది. కానీ ఎందుకు ఏవేవో ఊహించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు? దుబాయ్‌ అధికారుల విచారణ పూర్తి కాకుండానే, భారత్‌ కి చెందిన కొన్ని మీడియా వర్గాలు ఈ కేసులో న్యాయమూర్తి గా వ్యవ హరించాలని చూస్తున్నాయి. అధికారులు నిజానిజాలు తెలుసు కుంటున్నారు. బాత్‌ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి పోవడం వల్లే శ్రీదేవి చనిపోయిందని ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. భారత్‌ కు చెందిన మీడియాకు ఒక్కటే చెప్పాలను కుంటున్నాం. ఇలాంటి సమయంలో కాస్త ఓపిక పట్టండి  అని "ఖలీజ్‌ టైమ్స్‌" తెలిపింది. 


మరో వైపు శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబయికి తరలించడానికి మరింత జాప్యం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌ ప్రభుత్వం అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని యూఏఈ లో భారత రాయబారి నవ్‌దీప్‌ సూరి వెల్లడించారు. అంతే కాదు బోనీ కపూర్ కు దుబాయి పోలీసులు క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ శ్రీదేవి భౌతిక కాయం భారత్‌కు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. ఉత్కంఠకు తెరదించుతూ పార్థివదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్ప గించేందుకు దుబాయ్‌ పోలీసులు అంగీకరించారు.
sridevi death pictures కోసం చిత్ర ఫలితం

ఈ మేరకు ప్రాసిక్యూషన్‌ నుంచి అనుమతి రాగానే సంబంధిత పత్రాలను అక్కడి పోలీసులు భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబ సభ్యులకు అందజేశారు. శ్రీదేవి పార్థివదేహాన్ని రసాయనిక శుద్ధి (ఎంబామింగ్‌) తోపాటు ఇతర ప్రక్రియలు పూర్తికావడానికి సుమారు 3-4 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన శ్రీదేవి పార్థివదేహం ఈ రోజు రాత్రి 10 గంటలకు ముంబయికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ముంబైకి చేరుకున్నారు.

sridevi death pictures కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: