ఆ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మద్య హోరా హోరి యుద్దమే కొనసాగింది.  మొత్తానికి బీజేపీ జయకేతనం ఎగురవేసినా..కాంగ్రెస్ తన ప్రతాపాన్ని కొద్ది మేరకు చూపించింది.  తాజాగా పంజాబ్‌లోని లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయ ఢంకా మోగించింది. బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి కంగు తిన్నది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు మరోసారి భంగపాటు ఎదురైంది. లుథియానాలో 95 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు.
Image result for bjp
కట్టుదిట్టమైన భద్రత నడుమ తొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ 61 వార్డుల్లో ఘన విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బిజెపి 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో విజయం సాధించింది.
Image result for congress
నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. అతి పెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాలో పాగా వేసేందుకు కాంగ్రెసు తీవ్ర ప్రయత్నమే చేసింది.  కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమృత్ సర్, పాటియాలా, జలంధర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. గత శనివారంనాడు లూథియానా సివిక్ పోల్స్ జరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: