సిరియా...ఒకప్పుడు ఈ దేశం పేరెత్తితేనే హడలిపోయేవారు. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇక్కడే పుట్టింది. ప్రపంచంలో ఈ సంస్థ చేసిన, చేస్తున్న అరాచకాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇటీవల నిధులు లేక కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. హమ్మయ్య ఇక ఎటువంటి బాంబుల మోత ఉండదని సిరియా ప్రజలు అభిప్రాయపడ్డారు.


అయితే వారికి సైన్యం రూపంలో మరో పెనుప్రమాదం ముంచుకొచ్చింది. ప్రభుత్వం మద్దతుసైన్యం, వ్యతిరేఖ సైన్యానికి జరగుతున్న మారణహోమంలో అమాయకులు బలి అవుతున్నారు. ఎలాగోలా బతికిబట్టకట్టాంరా నాయనా! అని సురక్షిత ప్రాంతాలకు తరలిన మహిళలకు, యువతులకు కామాంధుల రూపంలో వేధింపులు తప్పడంలేదు. కొన్ని స్వచ్చంధ సంస్థల, ఐరాస వాలంటీర్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి చేరుకోవడం కష్టతరం కాబట్టి మధ్యవర్తుల, అధికారుల ద్వారా వారికి తిండి, నిత్యావసరాలు అందిస్తున్నారు.


కొంతమంది అధికారులు వారున్న పరిస్థితి చూసైనా కనికరం లేకుండా, వారికి సహాయ సహకారం అందించకుండా వారిని లైంగికంగా వేధిస్తున్నారు. వారి కోరికతీరుస్తే తప్ప వారికి ఆహార పదార్థాలను అందించడంలేదంట. కోరిక తీర్చలేదంటే మాత్రం వారిక ఆకలితో పస్తులుండాల్సిందే. అందుకే చాలా మంది యువతులు, మహిళలు శరణార్థులు శిబిరాల నుండి ఆహారం సరఫరా చేసే కేంద్రాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారట. ఈ విషయం ఐరాస దృష్టికి వచ్చిందని త్వరలొనే దానికి చెక్ పెట్టేయోచనలో ఉన్నట్లు ఐరాస ప్రతినిధి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: