ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని పలు ప్రైవేటు బీఈడీ, డీఈడీ కళాశాలల విద్యార్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించొద్దని ఏపీ ఉన్నత విద్యాశాఖ ను హైకోర్టు ఆదేశించింది. ఆ కళాశాలల్లో విద్యార్థులకు అక్రమంగా ప్రవేశాలు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్వీనర్‌ కోటా కింద మిగిలిన సీట్లన్నింటిని యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకోడానికి ప్రభుత్వం అనుమతివ్వడం వెనుక ఏదో జరిగిందని సందేహించింది.


యాజమాన్యకోటా కింద సీట్ల భర్తీకి అధికారులతో లాబీయింగ్‌ చేసి ఉంటారని వ్యాఖ్యానించింది. బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేని అలాంటి కళాశాలలకు కళ్లు మూసుకొని అనుమతి స్తుంటారు. అక్కడి విద్యార్థులు రేపు మనపిల్లలకు, మనవళ్లకు బోధిస్తారని ఘాటుగా వ్యాఖ్యా నించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కళాశాలల విద్యార్థుల పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

b ed exam results stopped by high court in ap కోసం చిత్ర ఫలితం

ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు విచారణను వారం రోజుల కు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగ నాథన్‌ జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశించింది.


గుంటూరు జిల్లా వినుకొండలోని ఎస్సార్డీఈడీ, జీఎస్సార్‌ డీఈడీ కాలేజ్‌(బాలికలు), సలమ్‌ డీఈడీ, అమరావతి డీఈడీ కళాశాలలు, ప్రకాశంజిల్లా కందుకూరు మండలం ఓగూరులోని ఎస్‌ఆర్‌డీఈడీ, యర్రగొండపాలెంలోని షారోన్‌ డీఈడీ కళాశాల, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని మహాత్మాగాంధీ డీఈడీ కళాశాలల్లో 2016-17, 17-18 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నిర్వహించిన వేయి సీట్ల కౌన్సెలింగ్‌లో కేవలం 163 మంది విద్యార్థులు చేరారని, మొత్తం సీట్లు భర్తీ అయినట్లు ప్రభుత్వం నుంచి ఆయా కళాశాలలు ఆమోదం పొందేందుకు యత్నిస్తున్నాయంటూ పాత్రికేయు డు ఎన్‌.మాధవరావు హైకోర్టును ఆశ్రయించారు.


మరోవైపు వినుకొండలోని వివేకానంద బీఈడీ కళాశాల, అలీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ప్రకాశం జిల్లా ఓగూరు లోని అజాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, కందుకూరులోని నవ చైతన్య కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 2017-18, 2018-19 సంవత్సరాల ప్రవేశాల నిమిత్తం యాజమాన్యాలు సమర్పించిన విద్యార్థుల జాబితాను ఆమోదించకుండా అధికారుల్ని ఆదేశించాలని మరో వ్యాజ్యం వేశారు. పైన పేర్కొన్న జిల్లాల్లో ఒకే వ్యక్తి 21 బీఈడీ, డీఈడీ కళాశాలలను నిర్వహిస్తున్నారని పిటీషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది  సత్యప్రసాద్‌ తెలిపారు.

high court of ap & telangana కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: