భారత దేశంలో కొంత కాలంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు గురించి ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి కామాంధులకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..వీళ్ల తీరు మాత్రం మారడం లేదు. రోజు రోజుకీ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తూనే ఉంది. ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
Image result for prasanta-karmakar
తాజాగా మహిళా స్విమ్మర్లు స్నానం చేస్తుంటే పురుష స్విమ్మర్ వీడియో తీసి సస్పెండ్‌కు గురయ్యాడు. అతని పేరు ప్రశాంత్ కర్మాకర్. స్వదేశానికి చెందిన ప్రముఖ పారా స్విమ్మర్. కాగా, భారత ప్రభుత్వం అందించే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను కర్మాకర్ దక్కించుకున్నారు. 2011లో అర్జున అవార్డు, 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డు, 2014లో భీమ్ అవార్డు, 2009, 2011లో స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో 37 ప‌త‌కాలు గెలిచాడు.  వాస్తవానికి  ప్రశాంత్ కర్మాకర్ ఉత్తమమైన పారాలింపిక్స్.
Image result for prasanta-karmakar
తన ప్రదర్శనతో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టాడు కూడా. అయితే మహిళలపై లైంగిక వేధింపులకు తెగబడినవారికి నిర్భయ చట్టం కింద కఠినమైన శిక్షలు అమలు పరుస్తుంది ప్రభుత్వం. అయితే ప్రశాంత్ కర్మాకర్ వికృత చేష్టలతో భారత పారాలింపిక్స్ సంఘం ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా మూడేళ్ళపాటు నిషేధానికి గురయ్యాడు.  అంతే కాదు ప్రశాంత్ కర్మాకర్ అర్జున అవార్డు పొందిన తొలి భారత పారాలింపిక్ క్రీడాకారుడు . 2016 రియో పారాలింపిక్స్ గేమ్స్‌కు స్విమ్మింగ్ టీమ్ కోచ్‌గా కూడా వ్యవహరించిన ఘనత ఆయన సొంతం. అలాంటి స్విమ్మర్ ఇంత నీచమైన పని చేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: