సాధారణంగా అడవుల్లో సింహం,పులి,ఎలుగుబంటి,తోడేలు మరికొన్ని జంతువులను  క్రూరజంతువులుగా పరిగణిస్తారు.  అలాంటి కొన్ని సార్లు ఊళ్లలో పడి పెద్ద అలజడి సృష్టిస్తుంటాయి.  సాధారణంగా ఏలుగు బంటి గ్రామాల్లో కూడా సంచరిస్తుంటాయి..మనుషులను, పశువులను చంపి తింటుంటాయి. 

కొన్ని సార్లు అడవుల్లో ఈ క్రూర జంతువుల మద్య కూడా హోరా హోరి యుద్దం జరుగుతుంది..సింహం, పులి లాంటి జంతువులదే పై చేయి అవుతుంది.  తాజాగా మహారాష్ట్ర‌లోని చంద్రాపూర్ జిల్లాలోని ఉన్న తడోబా నేషనల్ పార్క్ లో ఓ  పెద్ద పులి, ఎలుగుబంటి మధ్య పోరాటం జరిగింది. మొదటి ఈ రెండు జంతువులు ఆడుకుంటున్నాయని అనుకున్నారు..కానీ వాటి మద్య పెద్ద యుద్దమే జరుగుతుందని తర్వాత తెలిసింది.

ఈ సంఘటను ఓ వ్యక్తి తన కెమెరాల్లో బంధిచాడు. పులిపైనే  పంజా విసురుతూ ఎలుగుబంటి ఎదురుదాడికి దిగింది.ఈ రెండింటి మధ్య దాదాపు 15 నిమిషాలపాటు కొట్టాట సాగిది  టూరిస్టులను పార్క్‌లో తిప్పుతున్న టూరిస్ట్ గైడ్ ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: