ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఎంపీ కవిత స్పందించారు. రైతుల కష్టాలపై ఆవేదనతో కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని, ప్రసంగంలో "మోదీ గారు" అనబోయి "మోడీ గాడు" అనే తప్పు దొర్లిందని, ప్రధానిని అవమానపరిచే సంకుచిత మనస్తత్వం తమకులేదని అన్నారు.Image result for kavita about kcr's toung slip on prime minister

ఒక్కోసారి ప్రసంగాల్లో తప్పులు దొర్లుతుంటాయని, ప్రధాని మోదీ కూడా గతంలో "600 కోట్ల మంది భారతీయులు తనకు ఓటేశారు" అని అన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. కేసీఆర్ ఉద్వేగ ప్రసంగంలో దొర్లిన చిన్నతప్పును పట్టుకుని బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదని కవిత చెప్పారు. ప్రధానిని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లేనంటూ అలాంటి ఉద్దేశం తమకు లేదని కవిత స్పష్టం చేశారు.

Image result for kavita about kcr's toung slip on prime minister

 రైతు బడ్జెట్ అని చెప్పి రైతులకు కేంద్రం కేటాయించిందేమి లేదని కవిత దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాకు 2014 నుంచి మద్దతు ఇస్తున్నామంటూ  విభజన చట్టం లోని ప్రతి హామీని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారానికి సంబంధించి 30 బిల్లులు ఇప్పటివరకు పెట్టారని, వ్యవసాయానికి సంబంధించిన ఒక్క బిల్లు కూడా పెట్టలేదని ఆరోపించారు. పార్లమెంట్‌ లో హక్కుల సాధన, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం మాట్లాడతామని అన్నారు.

Image result for kavita about kcr's toung slip on prime minister

సింపుల్ గా పొరపాటుకు చింతిస్తున్నా అనిచెపితే సరిపోయే దానికి ఇప్పటికీ నా మాటలకు నూరుశాతం కట్టుబడి ఉంటా అని మళ్ళా వాళ్లకు రగిలిన అగ్నికి ఆజ్యం పోయటమెందుకు. దీని గురించి మాట్లాడక వ్యవసాయం బడ్జెట్ అంటూ ఎంపిగారు సొల్లు కార్చటమెందుకని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణా లో కూడా ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందనుకుంటున్నారు.

Image result for kavita about kcr's toung slip on prime minister

 ప్రధాని మోదీ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై కేసీఆర్‌ ఉపయోగించిన పదజాలం సరికాదన్నారు.

Image result for nirmala sitharaman about kcr's tongue slip with kTr on prime minister

అబ్బా! ఏం ఫామిలీ రా! వీళ్ళది. తన నాయన నోరు జారుతుంటారని దాన్ని ఈజీగా తీసుకోవాలని కేసిఆర్ కుమారుడు అంటే - కూతురు ఏకాయకీ ప్లేట్ ఫిరాయించి "600 కోట్ల మంది భారతీయులు తనకు ఓటేశారు" అన్న మాటలోని తప్పిదంతో పోలుస్తున్నారు. వీళ్ళలోని అహంభావం అహంకారం అధికారం పోతే తప్ప వదిలేలాగా లేరు. 

Image result for nirmala sitharaman about kcr's tongue slip with kTr on prime minister

మరింత సమాచారం తెలుసుకోండి: