గత 2013 ఎన్నికల్లో 1.47 శాతం ఓట్లతో ప్రారంభమైన బాజపా జయకేతనం నేడు 43 శాతం ఓట్లు సాధించి ఈశాన్యరాష్ట్రాలను తన విజయాల ఖాతాకు జమ చేసుకుంది. అది తెలంగాణా లో కూడా పునఃర్విజయంగా రూపాంతరం చెందక మానదు అంటునారు నల్గొండ జిల్లా బాజాపా పరివారం. 
Related image
ఈశాన్యరాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బిజెపి, తన తెలంగాణా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. విజయోత్సవ సంరంభాలు అంబరాన్నంటాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల వ్యాప్తంగా బిజెపి శ్రేణులు ఈశాన్యరాష్త్ట్రాల తమ విజయోత్సవాన్ని నింగిని తాకేలా సంబరాలు జరుపుకున్నారు. 
నల్లగొండ జిల్లాపార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సంబరాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పాల్గొని దానికి మరింతశోభ తెచ్చారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ నృత్యాలు చేసి ఆనందోత్సాహాలను, ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి గెలుపుపట్ల తమ హర్షాతిరేకాలను ఎంతో సంబురం గా వ్యక్తం చేశారు. 
Related image
లక్ష్మణ్ సైతం కార్యకర్తలతో పాటు సంబరాల్లో పాల్గొని నృత్యం చేసి తను తన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతు దేశ వ్యాప్తంగా సాగుతున్న బిజెపి విజయ పరంపర, "నరేంద్ర మోదీ అశ్వమేధయాగం తెలంగాణలో బిజెపి గెలుపు" తో పూర్తవుతుందన్నారు. నరెంద్ర మోదీ పాలనకు దేశ ప్రజలంతా దిశా దశా బేధం లేకుండా ఆసేతు శీతాచలం జనవాహిని మద్ధతుగా నిలుస్తున్నారన్నారు.
Related image

తెలంగాణలో బిజెపి ప్రభంజనం, కుటుంబ పాలనకు చరమ గీతం నల్లగొండ జిల్లలో రాజకీయ మార్పు తోనే మొదలుకావాలన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మల రాజ శేఖర రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ విజయోత్సవ సంరంభంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింత సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నూకల వెంకట నారాయణ రెడ్డి, బాకి పాపయ్య, భరత్ గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, పి.శ్యాంసుందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి, జిల్లా నాయ కులు పి.సాంబయ్య, కె.నాగిరెడ్డి, పి.లింగస్వామి, సయ్యద్ పాషా, రఫీ, వెంకన్నయాదవ్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.య్య, కె.నాగిరెడ్డి, పి.లింగస్వామి, సయ్యద్ పాషా, రఫీ, వెంకన్నయాదవ్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Image result for bjp flag on tripura fort

మరింత సమాచారం తెలుసుకోండి: