ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఐశ్వర్యవంతుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అని మనం విన్నాం. అయితే ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత కుబేరుల లిస్టు ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు కమ్ సీఈవో జెఫ్ బెజోస్ అని నిర్ధారించింది.


2018 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గత కొంతకాలంగా ప్రపంచం మొదటి కుబేరుడు స్థానములో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ స్థానం న్ని కైవసం చేసుకున్నాడు ఆమెజన్ వ్యవస్థాపకుడు కమ్ సీఈవో జెఫ్ బెజోస్. ప్రపంచంలోనే అత్యంత బిలియనీర్ల జాబితాలో మొదటి కుబేరుడు గా నిలిచాడు.


బెజోస్ మొత్తం సంపదను 112 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్క కట్టింది. ఈ భూమి మీద అత్యంత కుబేరుడిగా బెజోస్ అవతరించాడు. బెజోస్ తర్వాత స్థానం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్…..బిల్ గేట్స్ మొత్తం 90 బిలియన్ డాలర్లుగా తేల్చారు.


మూడో స్థానంలో అమెరికన్ వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ నిలిచారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ ఐదవ స్థానంలో నిలిచాడు. ఈ పరిణామంలో ప్రపంచకుబేరుల జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న అమెజాన్ సీఈవో బెజోస్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: