ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘరంగా జరుపుకుంటారు.  ఇప్పుడు ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఒక పురుషుడి జీవితంలో ఎన్నో రకాల పాత్ర పోషిస్తున్నారు మహిళలు. మార్చి 8 వస్తే మహిళలకు పండుగే... ఎందుకంటే మహిళా దినోత్సవ సంబరం వారి ముంగిట పలుకరిస్తుంది. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది.

ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది.  తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018, మార్చి 8వ తేదీ గురువారం మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి.

1909 ఫిబ్రవరి 28న ప్రపంచంలోనే మొదటిసారి జాతీయ మహిళా దినోత్సవం సదస్సు జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ నగరం దీనికి వేదిక అయ్యింది. ఆ తర్వాత 1911, మార్చి 19 నుంచి ప్రతి ఏటా అధికారికంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. వివిధ దేశాల్లో వేర్వేరు తేదీలుగా ఈ మహిళా దినోత్సవాలు జరుగుతుండేవి. ఇదిలా ఉంటే..1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: