భారత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ ధారుణంగా ఉందా? అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? రాహుల్ గాంధి కాంగ్రెస్ రాజ్యాభిషిక్తుడు అయినప్పటి  సమయానికి ఆ పార్టీ బలం-బలగం ఎలా ఉన్నాయి అని సమీక్షించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు అగుపిస్తున్నాయి.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత, దేశ వ్యాప్తంగా ఏ పార్టీ హవా ఎలా ఉన్నదనే చర్చలు "సోషల్ మీడియా" లో చలానే హల్-చల్ చేశాయి.  రాబోయే ఏడాది కాంగ్రెస్ పార్టీకి అత్యంత సంక్లిష్ట సమయంగాను అతి కీలకమైన కాలంగాను కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే కాంగ్రెస్ పాలిత మూడురాష్ట్రాల అసెంబ్లీ లకుగాను రెండింటిలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరెకంగా బాజపాకు అనుకూలంగా వచ్చాయి. అవే మెఘాలయ నాగాలాండ్. ఇక మూడో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రం కర్ణాటక మాత్రమే. అయితే కర్ణాటకలోకూడా కాంగ్రెస్ పరిస్థితి ఎమంత బాగున్నట్లు లేదు.
Image result for latest political map after mizoram nagaland results of India where congress in power 2018 as on today
దీని బట్టి కాంగ్రెస్ అంత్యకాలం దాపురించినట్లే.  "కాంగ్రెస్ ముక్త భారత్" అంటూ 2014 ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చేసిన నినాదం కార్యరూపంలోకి వస్తున్నట్లేనా? అనే భయం ఆ పార్టీ ప్రతి కార్యకర్తకూ కలుగుతోంది. ఇక పంజాబ్ రాష్ట్రం లోను, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోను కాంగ్రెస్ పాలన ఉంది. కర్ణాటక వ్యవహారం కీలకంగా కనిపిస్తోంది. అక్కడ భారతీయ జనతాపార్టీకి కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. ఒకసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర కూడా ఉంది. ఈసారి కూడా అధికారం లోకి వస్తాం అనే నమ్మకంతో ఆ పార్టీ ఆ రాష్ట్రం మీద చాలా కాలంగా చాలా శ్రద్ధ పెడుతోంది. 
Related image
కేంద్ర మంత్రులు, నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, కర్నాటకలో అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల కేంద్రం తరఫున జరిగిన ఒక అధికారిక కార్య క్రమానికి నరెంద్ర మోడీ హాజరైతే, రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద గౌడ కనీసం ప్రోటోకాల్ అంటే మర్యాదలు కూడా పట్టించుకోకుండా ఆ కార్యక్రమాలకు హాజరవ లేదు. ఆ రేంజి లో కాంగ్రెస్, బాజపా ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.
Image result for latest political map after mizoram nagaland results of India where congress in power 2018 as on today
కర్ణాటకలో అధికారం కోసం నిలుపు కోవటానికి  ఒకరు, అధికారం గెలుచు కోవటానికి మరొకరు గట్టిగానే పోటీ పడుతున్నాయి. ప్రజల్లో సిద్ధరామయ్య, ఆయన ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు, వ్యతిరేకత ఏర్పడి ఉన్న నేపథ్యంలో పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలు మార్పు కోరు తున్నారు కారణం తీవ్ర రూపం దాల్చిన యాంటీ ఇంకంబెన్సి.
India-locator-map-NE.svg

Map of India with northeastern states where in BJP in power after Mizoram & Nagaland election results

ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో గనుక కాంగ్రెస్ ఓడితే ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డట్లేనని భావించాలి. పైగా ఇటీవలి కాలంలో వ్యూహాలను మార్చి, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తన ప్రభ వ్యాపింపజేసి విజయాలు నమోదు చేసిన మోడీ-షా దళం, కర్నాటకను కోల్పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. త్రిపురనే గెలిచిన ఉత్సాహం వారికి ప్రోత్సాహం ఇచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ కోరిన భాజపాకు వామపక్ష ముక్త భారత్ బోనస్ గా లభిస్తుందన్నమాట. మొత్తంగా భారత రాజకీయ మ్యాప్ను చూస్తే కాంగ్రెస్ ఏలుబడి ఒక్క పంజాబ్ కు, వామపక్ష ఏలుబడి ఒక్క కేరళకు, మాత్రమే పరిమిత మౌతుంది.  

"పాండిచ్చేరి" లో కాంగ్రెస్ పాలన ఉన్నా, చిన్న చుక్క లాంటి దాన్ని మ్యాప్ లో వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంత క్లిష్టసమయంలో పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధి ఇప్పటి నుంచే కర్ణాటకపై ఇంకొంత ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప, ఏకంగా పార్టీ మనుగడ సాధ్యం కాదని, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేకతతో ఒక కూటమి అంటూ ఏర్పడినా దానికి సారథ్యం వహించే స్థితిలో కూడా రాహుల్ గాంధి ఉండలేని పరిస్థితి వస్తుంది. కూటమిలో నామమాత్ర భాగస్వామిగా ఉండే అతి చిన్న పార్టీగా కాంగ్రెస్ బతుకీడ్వవలసిన పరిస్థితి వస్తుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Image result for latest political map after mizoram nagaland results of India where congress in power 2018 as on today

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ చివర్లో లేదా మే మొదటి వారంలో జరిపేందుకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి, షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఈసీ ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. ఈనెల 20 తర్వాత ఏ క్షణంలోనైనా షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది. 224 మంది సభ్యులున్న అసెంబ్లీ కాలం మే 28తో ముగియనుంది. ఆ లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: