ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు..దీంతో ప్రజాప్రతినిధులు ఒక్కోక్కరూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష, విపక్షాలు గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికార పక్షం అయిన టీడీపీ కూడా కేంద్రంపై తిరగబడుతుంది..ప్రత్యేక హోదా హామీని తప్పకుండా నెరవేర్చాలని పంతం పడుతుంది.

నిన్న కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా కుదరదని దానికి బదులుకు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజ్ కింద ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు.  దీంతో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో తిరుగుబాటు మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా  చేశారు.  ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ కి గురయ్యారు. 


నా రాజకీయ జీవితం 1982 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రిజిస్ట్రర్ నెంబర్ 80 గా సంతకం చేసి జాయిన్ అయ్యానని.  1984 లో ఎన్టీఆర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారని..నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీ నేత వెంకయ్యనాయుడు అని అన్నారు.  2014 లో నీతో మాట్లాడాలని పిలిచారు..మన మద్య స్నేహం కొద్దీ అడుగుతున్నానని..బీజేపీలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ సభ్యులు, కార్యక్తలు కలిసి నన్ను గెలిపించారు. నేను మంత్రిని అయ్యాక..అన్ని హాస్పిటల్స్ తిరిగి చూస్తూ..వాటి అభివృద్ది కి కృషి చేశానని అన్నారు. రాజకీయాల్లో ఉండి చెప్పాలి కనుక రాజకీయాల్లో ఎంట్రీ ఎంత ఘనంగా ఉంటుందో..ఎగ్జిట్ అంత బాధ ఉంటుందని అన్నారు.  సహచర సభ్యులకు మీ అందరితో కలిసి పనిచేసిందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో అదే రకంగా ఉంటానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: