Related image

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీనే ఆశ్చర్య చకితులను చేసే సంఘటన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు భారీ ఎత్తున కరెన్సీ ని దాచుకున్నారా?అందుకే ఏటీఎం లలో నోట్ల కొరత ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు స్వయానా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అవునన్నట్లుగా సమాధానం చెబుతున్నారు 

బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి లో ఉండగా, తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్ప లీల అక్కడికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎం లలో డబ్బులు లేవని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయనకు వివరించారు. 

Image result for no cash in ATMs of aps Telangana

దీనికి మంత్రి స్పందిస్తూ, తాము ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన దానికంటే ఎక్కువ కరెన్సీని సరఫరా చేశామని వివరించారు. అయినా, కరెన్సీ కొరత నెలకొనడం ఆశ్చర్య కరమన్నారు. నోట్ల కట్టలను ఇళ్లలో, లాకర్లలో దాచు కోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Image result for ex minister pushpaleela & arun jaitly

దేశంలో ముంబయి, కలకత్తా, బంగళూరు, చెన్నై నగరాల తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇంతగా కరన్సీ కొరత లేదు. భారతీయ సెంట్రల్ బాంక్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు సాధారణ నగదు వితరణ కంటే ఎక్కువేనన్న సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. 

Image result for ex minister pushpaleela

మరింత సమాచారం తెలుసుకోండి: