తృణ ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం వాటిని చాలా తక్కువగా ఆహారంలో తీసుకుంటాం.. రోజూ ఆహారంలో తృణ ధాన్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆహర నిపుణులు సూచిస్తున్నారు. తృణ ధాన్యాల్లో సజ్జలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటిని గంట్లు, గంటెలని కూడా పిలుస్తారు. ఇవి వగరు , తీపి రుచులు కలిగి ఉంటాయి. 

Related image

ఇది రుచికరమైన  ఆరోగ్యదాయకమైన , శక్తి నిచ్ఛే ఆహార ధాన్యం. సజ్జల్ని " బాడీ బిల్డింగ్ సీడ్స్ " అంటారు. ఆంద్రప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు. 
సజ్జలు చక్కటి ప్రోటీన్ పుడ్ . వీటిలో కాల్షియం , ఐరన్ అధికంగా ఉంటాయి. ఫాస్పరస్ , కెరోటిన్ అనే పదార్ధములు పుష్కలంగా ఉన్నాయి. సజ్జలను మెత్తగా పిండి చేసి , వాటితో రొట్టెలను తయారు చేసి తేనెతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మొలల బాధ తగ్గి ఉపశమనం కలుగుతుంది. 

Image result for sajjalu

మొలకెత్తిన ధాన్యాన్ని పిండి చేస్తే మాల్ట్ అంటారు. సజ్జల్ని తడిపి మూటగట్టి , మొలకలొచ్చిన తరువాత ఎండించి మరపట్టించుకుంటే ఆ మాల్ట్ లో ఎక్కువ జీవనీయ విలువలు ఉంటాయి. మొలకెత్తిన తరువాత సజ్జల్లో ప్రోటీన్లు అనేక రెట్లు వృద్ధి చెందుతాయి. విటమిన్లు , మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగానూ కెలరీలు తక్కువగానూ ఉండే సజ్జమాల్ట్ ఎక్కువ ప్రయోజనకారి. షుగర్ వ్యాధి , స్ధూలకాయమూ , పెద్ద బొజ్జ తగ్గడానికి మొలకెత్తిన సజ్జలు గొప్ప ఔషధంగా పని చేస్తాయి. 


Image result for sajjalu
సజ్జ జావ చేసుకొని త్రాగటం వల్ల శరీరానికి చలవ చేస్తుంది .  డీహైడ్రేషన్ బారిన పడకుండా సజ్జలు కాపాడతాయి. దీంతో పాటు శరీరంపై గాయాలు కూడా వేగంగా తగ్గిపోతాయి. సజ్జలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. సజ్జలతో చేసిన పదార్ధాలు తినటం వల్ల ఆరోగ్యకరమైన చర్మం , జుట్టు మీ సొంతమవుతుంది. సజ్జలు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గుండె బలానికి , ఎసిడిటీ సమస్యలకు సజ్జ మంచి ఆహారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: