త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జిష్ణు దేవ్ బర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, ఎంఎం జోషి హాజరయ్యారు. 

బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇండిజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎ ఫ్‌టీ)కి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా 59 స్థానాలకు ఫిబ్రవరి  18న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.   సీపీఎం అభ్యర్థి మరణంతో ఒక నియోజకవర్గంలో ఎన్నిక వాయిదాపడింది.
tripura-cm-viplav-sworn
కాగా, గోమ తి జిల్లా రాజ్‌ధర్ నగర్ గ్రామంలో 1971 నవంబరు 25న మధ్యతరగతి కటుం బంలో విప్లవ్ దేవ్ జన్మించారు. ఆయన తండ్రి హరధన్ దేవ్ అప్పట్లో జన్‌సంఘ్ స్థానిక నేతగా వ్యవహరించారు. 1999లో ఉదయ్‌పూర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

అక్కడ జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేశారు కూడా! అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా వున్నారు.. త్రిపురలో మరోసారి దీపావళి వచ్చిందని, అభివృద్ధి అనే దీపాన్ని ప్రజలు వెలిగించారని ప్రధాని మోడీ అన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికల్లో త్రిపుర ఎలక్షన్స్ కూడా ఒకటి అయిందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: