ఆంధ్రప్రదేశ్లో  ప్రత్యేకహోదా రగడ ఎక్కువయింది. సామాన్య మానవుడి నుండి సీఎం చంద్రబాబు వరకు ఆంధ్ర ప్రజలంతా బీజేపీ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ  ఇప్పటికే టీడీపీ కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రివర్గంలో ఉన్న బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. 


అయితే ప్రత్యేకహోదా అంశంతో పాటు, రాజ్యసభ ఎన్నికలపై కూడా ఒక కన్నేసి రెండింటికీ సమానంగా ఎత్తుగడలువేస్తున్నాడంట బాబు. రాజ్యసభలో ప్రతి రెండేళ్ళకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. కాగా ఈసారి రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కగా, వైయస్సార్సీపీ కి ఒక స్థానం దక్కనుంది.


ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు స్థానాలను విడిచిపెట్టొద్దని బాబు భావిస్తున్నాడట. రాజ్యసభ సభ్యులను శాసనసభ సభ్యులే ఎన్నుకుంటారు కాబట్టి మూడు స్థానాల్లో గెలవటానికి తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం అవసరం కానుంది. దీంతో వైసీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారంట బాబు. హోదా నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసారు గనుక ఆ పదవులను కొత్తగా చేరే వారికి కట్టబెడటానికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉంది అని తెలియల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: