అందరం డబ్బు సంపాదిస్తాం.. కానీ కొందరి డబ్బే ఎందుకు వృద్ధి అవుతుంది.. మరికొందరి దగ్గర డబ్బు ఎందుకు నిలవదు.. మరికొందరి దగ్గర డబ్బు వస్తుంటుంది.. వెంటనే పోతుంటుంది.. ఎందుకిలా.. మన ఇంట్లో డబ్బు సురక్షితంగా.. పెరుగుతూ ఉండాలంటే ఎక్కడ ఉంచాలి.. దీనిపై వాస్తు కొన్ని సూత్రాలు చెబుతుంది. అవేంటో తెలుసుకుందామా... 

Image result for indian money and gold
వాస్తు ప్రకారం, విలువైన వస్తువులను ఉంచే నగదు పెట్టెను ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచాలి. తద్వారా కుబేరుని కృపా కటాక్షాల కారణంగా అదృష్టం వరిస్తుందని సంపద రెట్టింపు అవుతుందని ఎక్కువ మంది నమ్ముతారు.  దక్షిణ దిక్కు విషయంలో జాగ్రత్త ఉత్తర దిక్కున నగదు పెట్టెను ఉంచినా, దాని అభిముఖం మాత్రం దక్షిణ దిక్కున ఉండకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. 

Image result for indian money and gold
తూర్పు దిశలో మీ నగదు పెట్టెని ఉంచడం ఏవేని కొన్ని కారణాల చేత నగదు పెట్టెని ఉత్తరదిక్కులో ఉంచలేని పక్షములో, తూర్పు దిక్కు దీనికి ప్రత్యామ్నాయం గా చెబుతారు. ముఖ్యంగా దుకాణ యజమానులకు ప్రత్యేకించిన స్థలంగా కూడా చెబుతారు. గదిలో నాలుగు మూలల్లో మీ నగదు పెట్టెని, ముఖ్యంగా ఈశాన్య, ఆగ్నేయ లేదా నైరుతి మూలలో ఉంచరాదు. మీ నగదు పెట్టె ఉత్తరం వైపు ఉంచడం మంచిది. సాధ్యమైతే, పూర్తిగా దక్షిణ ప్రాంతాలను నివారించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: