Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jun 20, 2018 | Last Updated 8:27 pm IST

Menu &Sections

Search

తెలంగాణాలో నిన్నటి ధర్మం, నేడు అధర్మం - ఇక్కడ పాలన నిరంకుశం?

తెలంగాణాలో నిన్నటి ధర్మం, నేడు అధర్మం - ఇక్కడ పాలన నిరంకుశం?
తెలంగాణాలో నిన్నటి ధర్మం, నేడు అధర్మం - ఇక్కడ పాలన నిరంకుశం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చూస్తుంటే కలవకుంట్ల చంద్రశేఖరరావు నిజాం ను మించిన నియంతలా ఉన్నారు. మంచి మానవత్వం మృగ్యమైన పాలన. మొత్తం తన పరివారమే పరిపాలిస్తుంటే అధి ప్రజాస్వామ్యమెలా ఔతుంది. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతం నిర్లక్ష్యానికి గురై ఇప్పుడు అనేక త్యాగాల అనంతరం అమరజీవుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణాగా ఏరపడి "పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందంగా తయారైంది" ఇప్పుడే ఇలా ఉంటే ఈ మహానుభావుడు తృతీయ ఫ్రంట్ పెట్టి భారత ప్రధాని కావాల ని కలలు కంటున్నారు. అదే జరిగితే ఇంకేమైనా ఉందా తానొక సార్వం సహా సార్వభౌముడు అనిపించుకుంటాడు. 
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
శనివారం మగ్దూంభవన్‌ వద్ద సీపీఐ నేతలు, కార్యకర్తలను అదుపు లోకి తీసుకున్న పోలీసులు ఏదో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయన పోలీసులను నిలదీశారు. "మా పార్టీ ఉమ్మడి కార్యాలయం ఇక్కడే ఉంది. ఒక పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. నన్నెందుకు అరెస్ట్‌ చేస్తున్నారు" అని రామకృష్ణ ప్రశ్నించారు. 
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
ప్రజల ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణలో పోలీసు నిర్బంధం ఇంతగా ఉండడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ పెద్ద ఉద్యమం జరుగుతోందని, దేశం లోని పలు పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. టీడీపీ-ఎన్డీయేతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకుని బయటకు వచ్చి, ప్రత్యెక హోదాపై పోరాటం చేయాలని పేర్కొన్నారు.
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards

ఆధునిక నిజాం కేసిఆర్ పాలన వ్యవస్థలోకి రానున్న మరో కుటుంబసభ్యుడు

kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపునిచ్చిన "మిలియన్‌ మార్చ్‌" ను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకోవడానికి, తెలంగాణ జేఏసీ చేపట్టిన 'మిలియన్‌-మార్చ్‌ స్ఫూర్తి సభ' ను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ఉదయం నుంచే ట్యాంక్‌-బండ్‌ను, పరిసర ప్రాంతాలను పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ లతో పాటు టీజేఏసీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, న్యూడెమోక్రసీ, అరుణోదయ, పీవోడబ్ల్యూ, తదితర వామపక్ష ప్రజాసంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్య కర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మిలియన్‌-మార్చ్‌ స్ఫూర్తి సభకు తరలివస్తున్న వారిని హైదరాబాద్‌ శివార్లలోనే అదుపులోకి తీసుకున్నారు. 
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards

టీజేఏసీ మిలియన్‌-మార్చ్‌ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే చైర్మన్‌ కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు  పరిసర ప్రాంతాల్లో మోహరించారు. కోదండరాంను కలసి స్ఫూర్తి సభకు వెళ్లేందుకు అక్కడికి వచ్చిన జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కోదండరాం ను అరెస్టు చేసేందుకు హైడ్రామా నడిపించారు. కోదండరాం నివాసం పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లిన పోలీసులు, అక్కడి నుంచి కోదండరాం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
ఈ సమయంలో పోలీసులను దారి మళ్లించేందుకు టీజేఏసీ కార్యకర్త ఒకరు కోదండరాం ఇంటి ప్రహరీ గోడ దూకి వెళుతున్నట్టుగా పారిపోయారు. అది చూసి హైరానా పడిన పోలీసులు, ఆయనను పట్టుకునేందుకు పరుగులు తీశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడిన కోదండరాం, పలువురు జేఏసీ నాయకులతో కలసి తన ఇంటికి తాళం వేసుకుని స్వీయ నిర్బంధం ప్రకటించుకున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు రావడంతో అరెస్టు చేశారు.
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా నిర్బంధిస్తూ, అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. కోదండరాం అరెస్టుకు ముందు తన నివాసం లో, అరెస్టు తర్వాత బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "మేమే తెలంగాణ తెచ్చినం, మా ఇష్టమున్నట్టుగా పాలనసాగిస్తాం, అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలపై ఇంత నిర్బంధమా? 
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
"2011లో ఎన్ని ఆంక్షలున్నా "మిలియన్‌ మార్చ్‌" ను విజయవంతం చేశాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇంతకాలం ఎదురు చూశాం. ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే, మిలియన్‌-మార్చ్‌ స్ఫూర్తి సభను ఏర్పాటు చేశాం. కానీ ప్రభుత్వం ఈ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరించడం నిరంకుశ పాలనకు నిదర్శనం"అని కోదండరాం మండిపడ్డారు. ఆయన్ను అందలం ఎక్కించిన "మిలియన్‌ మార్చ్‌" దాన్ని ఙ్జప్తికి తెచ్చుకొనే స్ఫూర్తి సభ" సీఎం కేసీఆర్‌కు ఇష్టంలేదని, అందుకే రెండు రోజుల నుంచి ముందస్తు అరెస్టులు చేశారని చెప్పారు. వేల మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని, అప్రజాస్వామికంగా కొనసాగుతున్న అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామని, పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు.
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. 'మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభా కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్యాంక్‌-బండ్‌కు బయలుదేరిన ఆయనను, పార్టీ కార్యాలయం మగ్దూంభవన్‌ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ నిర్బంధాలతో ఏం సాధిస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
రాష్ట్రవ్యాప్తంగా వందలాది సీపీఐ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారని, వారికి రాత్రి నుంచి తిండి కూడా పెట్టకుండా బాధ పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవసరమైన సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవసరం లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్బంధం విధించినా, నైతికంగా సీపీఐ టీజేఏసీలేగెలిచాయన్నారు.
kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
రాష్ట్రమంతా అప్రకటిత ఎమర్జెన్సి నడుస్తుందని. రాష్ట్ర ఉన్నత స్థాయి పాలకులంతా కెసిఆర్ కుటుంబసభ్యులేనని అంటే రాష్ట్రంలో కెసిఆర్ సార్వభౌముడుగా రాజ్య పాలనం చేస్తూ దేశలోనే అత్యంత నికృష్ట పరిస్థితులు కలిపించారని, దేశం స్వతంత్రమొచ్చి స్వాతంత్ర వాయువులు పీల్చేవేళ నాడు తెలంగాణా ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మ్రగ్గిన రోజులు గుర్తుకొస్తున్నాయని నాటి తరం వాళ్ళు నిన్నటి "మిలియన్ మార్చ్ స్పూర్తి సభ" పరిస్థితులు చూస్తూ అన్నారు.

kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards

kcr-&-family-rule-in-telangana-ts-police-is-guards
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిజెపికి చంద్రబాబు ఝలక్!!
ద్వాపరయుగంలోని స్వరవంచన నేటి మిమిక్రి దాని పితామహుడు వేణుమాధవ్ తుదిశ్వాస
సెక్స్ రాకెట్లో చిక్కుకున్న తెలుగు ప్రముఖులు -హే! భగవాన్ ఇది నిజం కాకుంటే బాగు!
జమ్ము కశ్మీర్లో రాజకీయాల్లో సంచలనం - గవర్నర్ పాలనకు రాజముద్ర
స్వీటీ చేస్తే అది తప్పు - అందువల్ల అది తప్పు కానే కాదు: పెళ్ళికి సిద్దమౌతున్న ఆనుష్క
ఆర్జీ ఫ్లాష్ టీమ్ - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం చేసిన సర్వే అంతా భూటకం! టెక్చర్డ్ వన్
టాలీవుడ్ హీరోయిన్స్ అమెరికా రంకుబాగోతం - పట్టిచ్చిన పేపర్-ట్రెయిల్
ఇంటర్నెట్-స్మార్ట్ ఫోన్ తో యువతకు 'బూతు భవిష్యత్ ' కానుందా?
సూపర్ స్టార్ మహెష్ బాబు కొర్టు ధిక్కారం - ఆపై కోర్ట్ ఆగ్రహం
చిత్రం చెప్పిన చంద్రబాబు డిల్లీ యాత్ర కథ - మద్దతు మీడియాలో చిడతల వాయింపులు
ప్రఖ్యాత టాలీవుడ్ హీరోయిన్ పై చార్జ్-షీట్!
ప్రాంతీయ జాతీయ నాయకులను హిందూ గుళ్ళ చుట్టూ తిప్పిన నరెంద్ర మోడీ!
హిస్టరీ సృష్టిస్తున్న నీరవ్ మోడి  'మిస్టరీ పాస్-పోర్ట్'
దేశ సమగ్రత విషయంలో ఎంఐఎం అసదుద్దీన్‌ ఒవైసీ వైఖరి సరైనదే
ఓటమిని అంగీకరించని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌! వీడు కూడ ఇంతే!!
ఎడిటోరియల్: తప్పుచేసి బొక్కబోర్లా పడ్డ టిడిపి!  ప్రజలకు టయిం వేష్ట్
పవన్ కళ్యాణ్ తో స్నేహం చేసి వాడుకొని అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ తెలియవా?
మమ్మల్నిఎవరూ తాకలేరు! కుమారస్వామి ధీమా!!
 2019ఎన్నికల వరకు చంద్రబాబు తీరు ఇంతే!
ప్రపంచ ప్రఖ్యాత జనరల్ మోటార్స్ 'సి.ఎఫ్.ఓ' గా భారతీయ మహిళ దివ్య సూర్యదేవర
వార్తా వీడియో ఏడిటింగ్: ఒక పార్టీ ప్రయోజనానికై పనిచేస్తున్న ప్రధాన మీడియా! బుగ్గన
About the author