ఎప్పుడైతే టీడిపి బిజెపి తో తెగ దింపులు చేసుకోవలనుకున్నదో అప్పటి నుంచి బిజెపి వైసిపి తో జత కట్టేందుకు వ్యూహాలు ఆమలు చేసున్నది. మోడీ అమిత్ షా ద్వయం వైసిపి తో అడుగులు వేసేందుకు ఒక్కొక స్టెప్ ముందుకు వేస్తుంది అని చెప్పవచ్చు. అమిత్ షా వ్యూహాల్లో భాగంగానే తెలుగుదేశం తో తెగ‌తెంపుల కార్యం మొద‌లైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పొమ్మ‌న‌లేక పొగ పెట్టేందుకు ప్ర‌త్యేక‌హోదా అనే ఆయుధాన్ని అడ్డుగా పెట్టుకుని చంద్ర‌బాబును కావాల‌నే దూరం చేస్తున్నార‌న్న వార్త‌లు జాతీయ స్థాయిలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
Image result for vijaya sai reddy and pm
చంద్రబాబు ఉన్నంత కాలం ఏపీలో బీజేపీ బ‌లం పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేనందున‌,  కొత్త ఎత్తుగ‌డ‌కు తెర‌దీసిన‌ట్లు తెలుస్తుంది. అందుకే బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌యి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదే పార్టీతో పొత్తుల‌కు శ్రీకారం చుట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు  గాను రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డితో రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ప‌టికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం అవ‌స‌ర‌మైతే బీజేపీతో చేతులు క‌లుపుతామ‌ని  గ‌తంలోనే చెప్పాడు.
Image result for vijaya sai reddy and pm
ప్ర‌త్యేక‌హోదా బీజేపీతోనే సాధ్య‌మ‌ని, మోదీ త‌మ డిమాండ్ల‌ను అంగీక‌రిస్తాడ‌ని విజ‌య‌సాయిరెడ్డి జాతీయ‌మీడియాతో చెప్పిన నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య అంత‌ర్గ‌త పొత్తు కుదిరింద‌ని  రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీకి చెందిన ఇద్ద‌రు నేత‌లు త‌మ కేంద్ర‌మంత్రి ప‌దవుల‌కు రాజీనామా చేసినందున‌, ఆ స్థానాల్లో కొత్త‌వారిని ఎంపిక చేయాల‌ని భావిస్తున్నార‌ట ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. అయితే, అవ‌కాశం ఉంటే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఆపార్టీతో మ‌రింత స‌ఖ్యత క‌న‌బ‌ర్చాల‌ని అమిత్ షా ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: