Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 2:36 am IST

Menu &Sections

Search

ముందు చూపులేని "రాగా" కు "నమో" చురకలు

ముందు చూపులేని "రాగా" కు "నమో" చురకలు
ముందు చూపులేని "రాగా" కు "నమో" చురకలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పోయిన నెలలో పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలను, యుపిఎ సర్కార్ నిర్వాకాలను ఒకసారి ఎండగట్టారు. వారి పాలనా విధానాలే దుర్విధానాలు అంటూ చీల్చి చెండారారు. అలా రాహుల్ గాంధి (రాగా) కి చురకలంటించారు నరెంద్ర మోడీ (నమో)  

congress-dint-have-vision-division-of-states-are-n

మనదేశంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా రాష్ట్రాలను విభజించారని. తద్వారా మూడు కొత్త రాష్ట్రాలు ఉత్తరా-ఖండ్, చత్తీస్-ఘడ్, జార్ఖండ్ ఏర్పాటుచేశారు.  ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా భవిష్యత్ లో రాకుండా ఈ విభజనలు చాలా చక్కగా జరిగాయని అన్నారు.  ప్రభుత్వాధినేతలకు ముందుచూపు విజన్ ఉండి, రాజకీయ స్వార్థం లేకుందా హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఎంత మంచి నిర్ణయాలు తీసుకోగలమో పై మూడు రాష్ట్రాల ఏర్పాటు మంచి ఉదాహరణ అన్నారు.


మీ చరిత్రలో అని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ “మీరు దేశాన్ని ముక్కలు చేశారు. విషం తాగించారు. స్వాతంత్రం ఏర్పడిన 70ఏళ్ల తర్వాత కూడా దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు మీ దేశ విభజన ఫలాలను, ఫలితాలను, ప్రతినిత్యం శిక్ష రూపంలో అనుభవిస్తున్నారన్నారు.  మీరు దేశాన్ని ఎలాగైతే ముక్కలు చేశారో అలాగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, హడావుడిగా పార్లమెంటు తలుపులు మూసేసి సభ సజావుగా లేకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించేశారన్నారు 

congress-dint-have-vision-division-of-states-are-n
మేం కూడా ఆంధ్రప్రదేశ్  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు సానుకూలం గా ఉన్నప్పటికీ, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నదే ఇప్పటికీ మా లక్ష్యం.  కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు ఎన్నికల కోసం చేసిన హడావుడి నిర్ణయం చట్టం చేయటం లోని లోపం నిర్లక్ష్యం నాలుగేళ్ల తర్వాత కూడా సమస్యలు సృష్టిస్తోందని అన్నారు.

మీకు ఇలాంటి పనులు కీర్తి తెచ్చిపెట్టవని,  ‘మా హయాంలో అలా చేశాం, మేమైతే ఇలా చేసుండేవాళ్లం’ అంటూ క్యాసెట్ వినిపిస్తుంటారని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారని అన్నారు.  కానీ, భారత్ తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్లాయి. మనం వెళ్లలేకపోయాం. దీన్ని అంగీకరించితీరాలి మీరు -కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశాన్ని ముక్కలు చేసినా దేశం మీ వెంటే ఉంది. 
congress-dint-have-vision-division-of-states-are-n
మీరు దేశాన్నిపాలిస్తున్నప్పుడు ప్రతిపక్షం నామ మాత్రమే. అప్పుడు మీడియా కూడా నామ మాత్రమే.  ఊన్న మీడియా కూడా దేశాన్ని బలోపేతం చేయాలనే పనిచేసేది.  రేడియో కూడా మీ గీతాలే వినిపించేది. తర్వాత టీవీ వచ్చినా అది మీ సేవలోనే తరించేది.  న్యాయ వ్యవస్థలో కూడా ఎవరుండాలనేది కాంగ్రెస్ పార్టీయే నిర్ణయించేది, తమకు అనుకూలురను నియమించేది. 

పంచాయితీల నుంచి పార్లమెంటు వరకూ మీ పతాకమే ఎగిరేది. అంత విలాసవంతమైన పరిస్థితులు మీకు ఉండేది. కానీ, మీరు ఆ సమయాన్నంతా ఒక కుటుంబం కోసం (ఆ కుటుంబ పాటలు పాడుకుంటూ ‘రాగా’ లు ఆలపిస్తూ ప్రజలను విలపింపజేసేవారు) గడిపారు. దేశం మొత్తం ఒకే కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని మొత్తం శక్తి యుక్తుల న్నీ అక్కడే వెచ్చించారు.

congress-dint-have-vision-division-of-states-are-n

ఆ సమయంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజల ఆకాంక్షల  మేరకు మీరు పని చేసి ఉంటే దేశం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లేది. కానీ, మీరు మాత్రం సొంత డబ్బా వాయించుకున్నారు.నేను ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగం విన్నాను.  ఆయన అధికార పక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కర్నాటక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? నాకప్పుడు అర్థంకాలేదు. ఖర్గే వినిపించిన కవితల్ని కర్నాటక ముఖ్యమంత్రి కచ్చితంగా వినేఉంటారని ఆశిస్తున్నా. ‘నిజమే  చెప్పాలి’ అని ఆ కవిత ప్రారంభంలో ఉన్న అక్షరాలను మాత్రం ఖర్గే నిజంగా ప్రస్తావించలేదు.


కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆగస్టు 15, 1947 తర్వాతే దేశం ఏర్పడిందని, అంతకు ముందు దేశమే లేదనే భావనలో ఉంటారు. ఇది వారి అహంకారమా? తెలుసుకోలేక పోవటమా? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీయో, నెహ్రూనో ప్రజాస్వామ్యా న్ని ఈ దేశానికి ఇవ్వలేదు. ఎప్పట్నుంచో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది.
congress-dint-have-vision-division-of-states-are-n
రాజీవ్ గాంధీ (నాడూ రాగానే) హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఎన్నుకున్నషెడ్యూల్డు కులానికి చెందిన ముఖ్యమంత్రి స్వాగతం పలకటానికి విమానాశ్రయానికి వస్తే ఆ దళిత ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారు. అలాంటి మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? 

తెలుగు దేశం పార్టీ ఆ అవమానపు ఆగ్రహ జ్వాలల నుంచే పుట్టుకొచ్చింది. ఎన్టీ రామారావు నాయకత్వం కూడా అక్కడే పురుడు పోసుకుంది.  అంజయ్యకు జరిగిన అవమానాన్ని సరిదిద్దటానికే రామారావు తన సినీ జీవితాన్ని వదిలిపెట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు (రాజకీయాల్లోకి) వచ్చారు.అలాంటి మీరు ప్రజా స్వామ్యం గురించి మాట్లాడుతున్నారా?
congress-dint-have-vision-division-of-states-are-n
90 కంటే ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి.. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, ప్రజలు ఎన్నుకున్నపార్టీలను అధికారంలోంచి పీకేశారు.నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి పోటీలో నిలబడ్డారు. రాత్రికి రాత్రి మీరు ఆయన్ను ఓడించారు. అంజయ్య విషయంలో ఏం చేశారో? సంజీవరెడ్డి విషయంలో  అదే చేశారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్ననిర్ణయాన్నిమీ పార్టీ అత్యున్నత నాయకుడొకరు ప్రెస్‌మీట్‌లో చించేశారు. ఇలాంటివి మీకు కీర్తి తెచ్చిపెట్టవని నమో అన్నారు. 

15 కాంగ్రెస్ కమిటీల్లో 12 కమిటీలు సమర్థించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ప్రధమ ప్రధాన మంత్రి కాకుండా అడ్డుపడిన అదేం ప్రజాస్వామ్యం. జవహర్లాల్ నెహ్రూను ప్రధానిని చేశారు. సర్దార్ వల్లబ్ భాయి పటేల్ తొలి ప్రధాని అయితే ఇప్పుడీ కశ్మీర్ సమస్య ఉండేది కాదు.అలాంటి మీరు ప్రజాస్వామ్య పాఠాన్ని మా చేత చదివించాలని చూడొద్దు అంటూ ముగించారు. 
congress-dint-have-vision-division-of-states-are-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఖర్చు తడిసి మోపెడు - ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
"ఆపరేషన్ గరుడ" విషయంలో శివాజిని నిఘాసంస్థలు విచారించవలసిన అవసరంలేదా?
About the author