రాష్ట్రంలో ప్రస్తుతం రెండు హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. మొదటిది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అయితే రెండోది మాత్రం రాజ్యసభ ఎన్నికలు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ కు రేపటితో గడువుముగియనుండడంతో రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ లు  తమ తమ పార్టీలకు సంబందించి అభ్యర్థులను ఎంపికచేసుకొనే పనిలో ఉన్నాయి.


రాష్ట్రానికి 3 రాజ్యసభ సీట్లు దక్కగా అందులో టీడీపీకి 2, వైసీపీకి 1 సీటు దక్కిన విషయం తెలిసిందే. టీడీపీ మటుకు తాము కేవలం రెండు స్థానాలకే పోటీ చేస్తామని తెలిపింది. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంటే అన్ని మూడు స్థానాలను టీడీపీ సాదించుకోగలదు. ఇలా తన ఎమ్మెల్యేలను మభ్యపెట్టే అవకాశం ఉండడంతో ఢిల్లీలో హోదాపై పోరాటం అనంతరం జగన్ తన ఎమ్మెల్యేలను నేపాల్ కు పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఇక అక్కడి నుండి ఎమ్మెల్యే ముస్తఫా షేక్ శనివారం గుంటూరు చేరుకున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జగన్ అందరిని నేపాల్ పంపించాడు అని వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. ఎమ్మెల్యేలు అందరూ విహారయాత్రలో భాగంగానే అక్కడికి వెళ్లారని ఇందులో రాజకీయ వ్యూహం ఏదీ లేదని ఆయన స్పష్టం చేసారు. తన నియోజకవర్గంలో డయేరియా ఎక్కువగా ప్రభలిస్తుందన్న వార్తలు రావటం వల్ల తానిక్కడికివచ్చినట్లు ఆయన తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: