విరాట్ – అనుష్క జంట గురించి ఇప్పుడు తెలియని వారుండరు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు హాలిడే మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది. శ్రీలంక సిరీస్ కు కూడా వెళ్లకుండా కోహ్లీ అనుష్కతో టైం స్పెండ్ చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ ఉన్న ఓ ఫోటోను అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అది మామూలు పిక్ కాదు.


          అనుష్క – కోహ్లీ జంట గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. పెళ్లికి ముందే వారిద్దరూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని కామెంట్స్ చేసినా వాళ్లు పట్టించుకోలేదు. ఎవరిపనులు వాళ్లు చేసుకుపోయేవారు. సినిమాల్లో అనుష్క బిజీగా ఉంటే, కోహ్లీ క్రికెట్ లో ఫుల్ బిజీ..! అయితే వాళ్లకు సమయం చిక్కినప్పుడల్లా వాళ్ల పర్సనల్ లైఫ్ కి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు అలాగే ఎంజాయ్ చేస్తోందీ జంట.

Image result for anushka kohli kiss

          కోహ్లీ – అనుష్క జంటకు సంబంధించి విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా కోహ్లీని ముద్దు పెడుతూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో పెట్టింది. ఇది ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. కోహ్లీ బుగ్గపై ఘాటుగా ముద్దు పెడ్తున్న ఈ ఫోటోను చూసి విరుష్క అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Image result for anushka kohli kiss

          అనుష్క ఈరోజే తన సుయ్ ధాగా షూటింగ్ ముగించుకుని ముంబై చేరుకుంది. అనుష్కను రిసీవ్ చేసుకునేందుగు కోహ్లీ స్వయంగా ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. ముంబైలోని తమ నివాసంలో ఇప్పుడీ జంట వీకెండ్ ను ఎంజాయ్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: