కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అభద్రతా భావంలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రాష్ట్ర బిజెపి నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం కంగారుపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ అన్యాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి బింకం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీ నేతలను కలవరపరుస్తోంది.


ప్రత్యేక హోదా విషయంలో ఇటీవల చంద్రబాబు కేంద్రంలో ఉన్న తన మంత్రుల చేత రాజీనామా చేపించిన నేపథ్యంలో. కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ పెద్దలు రాష్ట్ర క్యాబినెట్ లో నుండి తమ మంత్రులను రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర బిజెపి నాయకులకు. ఉదయం ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. ‘‘అసెంబ్లీలో చంద్రబాబు కటీఫ్‌ నిర్ణయం ప్రకటించబోతున్నారు. వారు కేంద్రంలో మంత్రి పదవులకూ రాజీనామాలు చేస్తారు.


మీరు కూడా రాజీనామాలు సిద్ధం చేసుకొని ఉండాలి. సీఎం తన నిర్ణయం ప్రకటించిన వెంటనే అసెంబ్లీలోనే మీరూ రాజీనామాల గురించి చెప్పండి. స్పీకర్‌కు ముందుగా సమాచారం ఇచ్చి సభలో మాట్లాడటానికి అనుమతి తీసుకోండి’’ అని ఆదేశించారు. ఢిల్లీ నేతల హడావుడి చూసి ఇక్కడి బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులను కొంతమంది కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేస్తున్నారని కితాబిచ్చారు.


చంద్రబాబునాయుడు వర్గానికి సంబంధించిన కొంతమంది బిజెపి నాయకులు. అయితే ఈ క్రమంలో మరో వర్గం చంద్రబాబును వ్యతిరేకించే వర్గం వీరు మాత్రం కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల చేత రాజీనామా చేయించాలని చూశారు. అయితే వారు రాజీనామా చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి రెండు వర్గాలుగా చీలిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: