గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పనిచేసిన సీనియర్ నటి కవిత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. గడచిన కొద్ది కాలంగా పార్టీలో తీవ్ర అవమానం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కవిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు ఆధ్వర్యంలో కవితా బిజెపి కండువా  కండువా కప్పుకున్నారు.


కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అయితే తాను టీడీపీ నుంచి బయటకు రాలేదనీ… ఆ పార్టీ నుంచి గెంటి వేయబడ్డానని అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డానని, టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, చంద్రబాబును తిడుతున్నవారికి పదవులిచ్చారే తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మొండిచేయి చూపారని కవిత వ్యాఖ్యానించారు.


అంతేకాకుండా ఇంత కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నందున సిగ్గుపడుతున్నానని అన్నారు కవిత. ప్రజలకు అబద్ధం చెప్పి మోసం చేసిన నాయకులు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని కవిత అన్నారు.


ప్రస్తుతం భారత దేశం ప్రధాని మోడీ హయాంలో అభివృద్ధి పథంలోకి వెళుతుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ లోకి రావడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని సంచలమైన వ్యాఖ్యలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: