ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ పేర్లను ఖరారు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఒ.సి కేటగిరికి చెందిన ఇద్దరు నాయకులను రాజ్యసభకు పంపుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ పదవీ విరమణ ముగుస్తున్న సీఎం రమేష్ ని మరొకసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు.


అలాగే పార్టీలే లీగల్ సెల్ అధ్యక్షుడు అధ్యక్షుడు‌ కనకమేడల రవీంద్రకుమార్‌ను పేరును చంద్రబాబు ఖరారు చేసారు. ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య పేరు చివరి క్షణం వరకు వినపడటం జరిగింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు మారిన సమీకరణాల నేపధ్యంలోనే వర్ల రామయ్య స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్‌ పేరు తెరపైకి వచ్చింది.


దీనిపై వర్ల రామయ్య భిన్నంగా స్పందించారు. రాజ్యసభ అభ్యర్ధిగా తొలుత ఖరారు చేసినా చివరి క్షణంలో పార్టీ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు వర్ల రామయ్యకి కీలక పదవి అప్పజెప్పే పరిశీలనలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.


అచంచలమైన విశ్వాసంతో సీఎం చంద్రబాబు తనకు రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేయడం తన జీవితంలో మరువరాని రోజని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఈ రెండు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: