విపరీతమైన సస్పెన్స్ తర్వాత టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ ప్రస్తుత సభ్యుడు, కడప జిల్లాకు చెందిన సి.ఎం.రమేష్‌, పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు, కృష్ణా జిల్లాకు చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌ల రాజ్యసభ సీట్లు దక్కాయి. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. వీరిద్దరూ సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారు. ఐతే.. ఈ క్రమంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి.  

Image result for CM RAMESH AND VARLA
వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఖాయమని ఆదివారం మధ్యాహ్నం వరకూ అంతా అనుకున్నారు. అన్ని ఛానళ్లలోనూ వర్ల రామయ్య పేరు ఖరారు అంటూ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. వర్ల రామయ్య కూడా తనకు సీటు ఖాయమైందని సంతోషపడిపోయారు. ఇక్కడే ఓ అనూహ్య ఘటన జరిగింది. 24 గంటల న్యూస్ ఛానెల్స్ హడావిడిలో అందరికంటే ముందు ఉండాలన్న తాపత్రయం ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఆడుకుంది. 


వర్ల రామయ్యను కలిసిన టీవీ 9.. ఆయన్ను ఇంటర్వూ చేసింది. ఐతే.. ఆయన రాజ్యసభకు ఎన్నికైపోయారు అనే యాంగిల్లో ఇంటర్వ్యూ చేసింది. ఐతే.. దాన్ని ఇప్పుడే ప్రసారం చేయవద్దని.. అధికారికంగా ప్రకటించాక వేయాలని వర్ల సూచించారట. టీవీ9 సిబ్బంది కూడా అలాగే చేస్తాం.. మీ పేరు ప్రకటించాకే ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేస్తామని మాట ఇచ్చారట. 


కానీ మరు క్షణంలోనే టీవీ9 సిబ్బంది ఒట్టు తీసి గట్టున పెట్టేసి.. వర్ల ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేశారట. టీవీ9 లో వర్ల ఇంటర్వ్యూ చూసిన చంద్రబాబు షాకయ్యారట. ప్రకటించక ముందే అంత తొందరేంటి అని వర్లపై మండిపడ్డారట. సీఎం నేరుగా వర్లకు ఫోన్ చేసి అక్షింతలు వేసినట్టు సమాచారం. అంతే కాదు.. ఆ కోపంతోనే చివరి నిమిషంలో వర్లను కాదని కనకమేడల రవీంద్రకుమార్ ను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: