రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరించిన తీరుతో కేంద్ర క్యాబినెట్ లో ఉన్న తన మంత్రుల చేత రాజీనామా చేపించిన చంద్రబాబు. ఈసారి ట్విట్టర్ ద్వారా కేంద్రంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బిజెపి పార్టీ సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెడుతూ ట్విట్టర్ ద్వారా కొన్ని ట్విట్స్ చేశారు. తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ చూస్తుంటే చంద్రబాబు త్వరలోనే కేంద్రంపై పోరుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.


ట్వీట్ వివరాలలోకి వెళ్తే..”కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. ‘సెంటి మెంట్‌కు డబ్బులు రావు’ అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే ‘తెలంగాణ’ రాష్ట్రాన్ని ఇచ్చారు.” అంటూ ఒక ట్వీట్ చేసిన చంద్రబాబు రెండవ ట్వీట్ లో కొంచెం ఘాటు పెంచారు…”రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఆ అనుభవం నాకుంది. కష్టపడే తత్వం ప్రజలకుంది. కానీ హక్కుల విషయంలో బీజేపీ అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతూ.. న్యాయం చేయాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంత వరకు న్యాయమో ఆలోచించుకోవాలి.” అంటూ మరో ట్వీట్ వేసారు.


ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీజేపీ పార్టీ పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. అసెంబ్లీలో చంద్రబాబు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పరు. ఈ నేపథ్యంలో విభజన సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.


అంతేకాకుండా మీ దగ్గర ఉన్నా మాదగ్గర ఉన్న డబ్బు అంటూ ఏమి ఉండదు ఎవరి వద్ద ఉన్నా సరే అది పబ్లిక్ డబ్బు అంటూ మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యవహరించినట్లు మిగతా రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తే దేశంలో బీజేపీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: