రాష్ట్ర బిజెపి పార్టీ టిడిపి అధినేత చంద్రబాబును ఎంత విమర్శిస్తే అంత లాభం చేకూర్చే దిశగా నాయకులకు ఆఫర్లు ఇస్తుంది. ఈ క్రమంలో మొన్నటివరకూ రెచ్చిపోయిన సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకులు రాష్ట్ర బీజేపీ పార్టీలో పెద్దలు గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ జాబితాలోకి చేరిపోయింది సినీ నటి కవిత.


మొన్ననే బిజెపి పార్టీ లోకి వెళ్లిన కవిత. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగంలో పదవి కట్ట పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడు, విభజనకు గురై రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో నలిగిపోతుంటే చంద్రబాబు మాత్రం కేంద్రం ఇచ్చిన డబ్బులతో తన ఖజానాను అన్యాయంగా నింపుకొంటున్నారని అన్నారు కవిత.


ఈ నేపథ్యంలో కవిత వంటి నేతలను ముఖ్యంగా టీడీపీని చంద్రబాబును విమర్శించే నేతలను చేరదీస్తున్న బీజేపీ తీరును టీడీపీ కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా యూపీఏలో కొనసాగుతామని టీడీపీ ప్రకటించింది.


ఈ ప్రకటన విన్న రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు ప్రపంచంలో ఉండరని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తమ రాజకీయ మనుగడ కోసం అన్యాయంగా విభజించిన యూపీఏలో టీడీపీ కలిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ స్మశానాలలో కలిసిపోయినట్లే అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: