విభజన హామీలు అమలు చేయలేదంటూ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్న ఏపీ సర్కారుకు కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయకుండా సతాయించడమే కాకుండా.. కొత్తగా ఇంకేమీ ఇచ్చేది లేదు పొండన్న సంకేతాలు ఇచ్చేస్తోంది. మొన్ననే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన కేంద్రం ఇప్పుడు ఇంకో హామీపైనా తేల్చేసింది. 

Image result for modi-babu
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. విశాఖ ప్రత్యేక జోన్ అనేది ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శే పక్కా క్లారిటీగా చెప్పేశారు. సోమవారం తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రైల్వేజోన్‌ సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని కామెంట్ చేశారు. 

Image result for vizag railway zone
ప్రత్యేక జోన్ ఇచ్చేందుకు రైల్వే బోర్డు కూడా అంగీకరించడం లేదని ఏపీ ప్రధాన కార్యదర్శకి వివరించారట. విభజన సమస్యల అమలు పురోగతి విషయమై ఈ సమావేశం జరిగింది. ఇందులో అనేక విభజన సమస్యలపై చర్చ జరిగింది. ఆ సమయంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రత్యేక జోన్ గురించి వివరించారట. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న రైల్వేజోన్‌ సాధ్యంకాదని చెప్పేశారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: