ముఖ్యమంత్రి ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం.. అవును ఇది నిజం.. కాకపోతే..ఇది ఇప్పటి విషయం కాదు.. కానీ ఇప్పుడు దీనిపై కొత్త కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సీఎం ఎవరంటారా.. మొన్ననే పాతికేళ్లుగా త్రిపుర సీఎంగా ఉండి దిగిపోయిన మాణిక్ సర్కార్.. అవును.. 2004-05 సమయంలో ఆయన ఇంట్లో ఓ మహిళ అస్తిపంజరం బయపడిందట.

Image result for manik sarkar lady skeleton
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా బయటకు తీసుకువస్తున్నారు. అప్పటి ఆ సంఘటనపై విచారణ కోరుతున్నారు. అంతే కాదు.. సీపీఎం నేతలంతా రౌడీషీటర్లూ, హత్యారాజకీయాలు చేసేవారేనంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే మాణిక్ సర్కారు హయాంలో పనిచేసిన మంత్రుల ఇళ్ల సెప్టిక్ ట్యాంకులన్నీ పరిశోధించాలని కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు.

Image result for manik sarkar lady skeleton
ఈ మేరకు త్రిపుర బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దేవ్ దర్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన విప్లవ్ కుమార్ దేవ్ ను ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జనవి 4, 2005 రోజు మాణిక్ సర్కార్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం వెలుగు చూసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సంఘటన మాత్రం వాస్తవమేనట. దీనిపై అప్పట్లో విచారణ కూడా జరిగిందట.

Image result for manik sarkar lady skeleton
మరి ఆ విచారణ రిపోర్ట్ మాత్రం ఇంతవరకూ వెలుగు చూడలేదు. మరి నిజాయితీ పరుడుగా పేరున్న మాణిక్ సర్కార్ ఇంట్లో మహిళ శవం ఎందుకు లభ్యమైంది.. దానికి కారణాలేంటి.. అనే విషయాలు బీజేపీ సర్కారు పాలనలోనైనా వెలుగు చూస్తాయేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: