నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాలకు కొత్త మార్గాలు వెదుక్కుంటున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను వాడేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ 
లో ఓ కామాంధుడు ఇదే పని చేశాడు.. వాట్సప్ లో పరిచయం పెంచుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

Image result for whatsapp crime
వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ మలక్ పేటలో నివాసం ఉండే పవన్ కుమార్ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.. ఆరు నెలల క్రితం బాలాపూర్లో నివాసం ఉండే ఓ పెళ్లయిన యువతితో 
వాట్సప్ స్నేహం కలుపుకున్నాడు. క్రమంగా వరుస మెస్సేజులతో దాన్ని కొనసాగించాడు. అలా పరిచయం పెంచుకుని ఏకంగా ఆ మహిళ ఇంటికే వెళ్లిపోయాడు. ఆమెతో 
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 


ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ.. భర్తకు చెబుతానని బెదిరిస్తూ పలుసార్లు అత్యాచారం చేశాడు. చివరకు ఫిబ్రవరి 18 న ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసి.. ఆ తర్వాత చేతికి అందిన వస్తువులతో ఉడాయించాడు. దాదాపు 60 వేల రూపాయల నగదు, బంగారంతో పరారయ్యాడు. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. అందుకే మహిళలు అపరిచితులతో వాట్సప్, ఫేస్ బుక్ లలో జాగ్రత్తగా ఉండాలి. మేకవన్నెపులులను ఓ కంట కనిపెట్టాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: