చంద్ర బాబు రాజ్య సభ మూడో అభ్యర్ధి విషయం లో భేరాసారాలకు దిగిడాని ఎమ్మెల్యేల కొనుగోలు మొదల పెట్టాడని అందరు అనుకుంటున్నారు. అయితే ఇక్కడే వచ్చింది అస్సలు సమస్య చంద్ర బాబు మాత్రమే కొనుగోలు చేసినప్పుడు అవతలి పార్టీ కూడా కొనుగోలు చేయొచ్చు కదా! సరిగ్గా ఇదే పద్ధతి పాటించింది వైసిపి.
Image result for chandra babu and jagan
నిజానికి తొలి ఇద్దరు అభ్యర్థులుగా ఇతరుల్ని రంగంలో ఉంచి, ఆర్థిక వనరుల భారం భరించగల సీఎం  రమేష్ ను మూడో అభ్యర్థి చేయాలని అనుకున్నారు గానీ.. అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఏదైతేనేం.. మొత్తానికి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. వైయస్సార్ కాంగ్రెసు ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తే వారి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లుగా చంద్రబాబుకు సమాచారం అందింది.
Image result for chandra babu and jagan
తెదేపా నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం అంటూ జరిగితే పార్టీ శిథిలమై పోయినట్లుగా విస్తృత ప్రచారం జరుగుతుంది అనే భయంతో ఆయన పూర్తిగా వెనక్కు తగ్గారని సమాచారం. తాము వైసీపీ నుంచి లాగదలుచుకుంటే వారు తెదేపా నుంచి లాగడానికి సిద్ధంకావడం ఆయనకు మింగుడుపడలేదు. చివరికి పార్టీ కుప్పకూలుతుందనే భయంతో ఆ జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోయారని... అని పార్టీ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ విధంగా.. అంతా సవ్యంగా.. రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా  ముగిసే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఇది  చంద్ర బాబు కు కుక్క కాటుకు చొప్పు దెబ్బ లాంటిదని చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: