సాధారణంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అని వాక్యం ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ నలుగురిని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు అని దాని అర్థం. ఇందులో దైవానికి  గురువు తర్వాతనే స్థానం కల్పించారు. అంటే దైవం కన్నా మొదట గురువుని గౌరవించాలని దాని భావం. ఆనాటి కాలం వరకు గురువంటే విద్యార్థులు చాలా గౌరవం ఇచ్చేవారు. కానీ ఈ కాలం విద్యార్థులు గౌరవం కాదు సరికదా ఏకంగా వారితో ప్రేమాయణాలే కొనసాగిస్తున్నారు.


తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక యువతి తన కాలేజీలో భోదిస్తున్న ఉపాధ్యాయురాలితో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆమెను మందలించారు. దీంతో కొంతకాలం కిందట ఇంటి నుంచి పారిపోయి తన టీచర్ తో కలిసి సహజీవనం చేసింది. దీంతో వారు యువతిని బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.


తమ సంబంధానికి తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారనే కోపంతో, ఆ యువతి తన అమ్మను ఎలాగైనా వదిలించుకోవాలనే నెపంతో కుట్రకు పాల్పడింది. ఇంట్లో ఎవరులేని సమయంలో తల్లిని కర్రలు, రాడ్లతో చితకబాదింది. కాగా ఆమె చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. భార్యను చంపడంతో యువతి తండ్రి కూతురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలిక, మహిళా టీచర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: