రాజకీయాల్లో అసహనం అవధులు దాటి చెలియలి కట్తను చెరిపేస్తున్న రోజులివి. ఎకాయకీ పదకొండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులను సభ నుంచి బడ్జెట్ సమావేశాల కాలం మొత్తం బహిష్కరించటమంటే ప్రజాస్వామ్యాన్ని నిలువునా రాజ్యాంగం ప్రసాధించిన శాసనసభలోనే పాతెయ్యటం అనిపిస్తుంది. సభలు దారితప్పుతున్నాయి. ఇరుపక్షాల నిర్వాకం సమర్ధనీయం కాదు.
telangana assembly yesterday కోసం చిత్ర ఫలితం
తెలంగాణా శాసనసభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించారనే కారణంతో కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేయడాన్ని ప్రతిపక్షం కాంగ్రేస్ విరోధి భారతీయ జనతా పార్టీ కూడా తప్పుపట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌ రెడ్డిల మధ్య వాడీ వేడి వాగ్వాధం నడిచింది. అరాచక శక్తులను సహించేది లేదని, కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని ముఖ్యమంత్రి  ఆగ్రహించగా, నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని బీజేపీ కాంగ్రెస్‌ కు మద్దతుగా నిలిచింది. సస్పెన్షన్ల నిర్ణయం సరికాదని కిషన్‌ రెడ్డి వాదించారు.

TRS vs BJP in Telangana Assembly - KCR vs Kishan reddy కోసం చిత్ర ఫలితం

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు, 9 మందిపై సస్పెన్షన్‌ వేటు నిర్ణయాలు బాధకారమే అయినా తీసుకోక తప్పలేదని ముఖ్యమంత్రి తెలిపారు. 


"ప్రజలకు మాత్రమే మేం జవాబు దారీ గా ఉంటాం. సభలో ఏ అంశాన్నైనా చర్చిస్తాం. కానీ అరాచక శక్తులను మాత్రం సహించే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం తీవ్రంగా పెరిగింది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోబోం. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందుకే కాంగ్రెస్‌ సభ్యులపై తీవ్ర చర్యలను సిఫార్సుచేశాం"  అని కేసీఆర్‌ అన్నారు.

ఇదే అంశంపై బీజేఎల్పీ నేత కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఆవేశ పూరిత నిరసనను అరాచకంగా భావించడం తగదన్నారు. 
"సభలో లేని విపక్ష ఎమ్మెల్యేను కూడా సస్పెండ్‌ చేసిన ఘన చరిత్ర టీఆర్‌ఎస్‌ సర్కారుది" అని గుర్తుచేశారు. 


TRS vs BJP in Telangana Assembly Yesterday కోసం చిత్ర ఫలితం

కిషన్‌ రెడ్డి మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పలు మార్లు కిషన్‌ రెడ్డి మైక్‌ను సభాపతి మధుసూధనాచారి కట్‌ చేయడం గమనార్హం.
కాంగ్రెస్‌ సభ్యులపై తీవ్ర చర్యలను టీఆర్‌ఎస్‌ తో పాటు మజ్లిస్‌ కూడా సమర్థిస్తున్నదని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. అసెంబ్లీలో నిన్న జరిగిన దాడిని ఎంఐఎం ఖండిస్తున్నదన్నారు.
TRS vs BJP in Telangana Assembly Yesterday కోసం చిత్ర ఫలితం
ప్రజల్లో కాంగ్రెస్ పై నిన్న ఉన్న వ్యతిరెఖత నేడు సానుభూతిగా మారింది. గతం లో హారీష్ రావు గవర్నర్ ను కొట్టటానికి ముందుకెళ్లటం అంతకుముందు ఇదే హరీష్ రావు డిల్లీ ఆంధ్ర ప్రదేశ్ భవన్ అధికారిపై చేయి చేసుకోవటం కూడా జరిగింది. అంతెందుకు తాగాగా తెలంగాణా పార్లమెంట్ సభ్యులు లొక్-సభ జరగకుండా అక్కడ వెల్ లోకి దూసుకుపోవటం ప్రజాస్వామ్యమా? అక్కడ టిఆరెస్ వారు చేసేది అరాచకం కాదా? ప్రజా సమస్యలను వదిలేసి శాసన నిర్మాణ సభలను దొమ్మీలకు వాడుకోవటం ప్రజల్లో టిఆరెస్ పట్ల వ్యతిరేఖత మొదలైంది. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: