రాష్ట్రంలో ప్రత్యేకహోదా రగడ, రాజ్యసభ ఎన్నికలు వంటి ఎన్ని హాట్ టాపిక్ లు నడుస్తున్నా జగన్ ఆరంభించిన ప్రజాసంకలయాత్ర మాత్రం జోరుగానే  కొనసాగుతుంది. పాదయాత్ర చేస్తూనే రాష్ట్రంలో స్థితిగతులపై జగన్ ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని తెలుసుకుంటూ, యాత్రలో ఉంటూనే తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాడు. కడపజిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు మూడు నెలలపాటు పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.


అయితే ఈ పాదయాత్ర మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రజలు తనని మరచిపోకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నాడు. తాజాగా పాదయాత్ర మధ్యలో ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. గత నాలుగు సంవత్సరాల నుండి చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలమయ్యారని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకరాలేకపోవడం ఈ రోజున నాతోపాటి ఉన్న ఈ అశేషజనవాహినికి నిదర్శనం అని ఆయన వెల్లడించారు.


అరుణ్ జైట్లీ గారు 2016 సెప్టెంబర్ నెల లోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని తేల్చేశారని ఇప్పుడు టీడీపీ మంత్రుల రాజీనామా దేనికి ఉపయోగం అని ఎద్దేవాజేశారు.  టీడీపీతో దూరమవుతున్న సమయంలో  బీజేపీ పొత్తు కోసం మిమ్మల్ని సంప్రదించిందా అని జర్నలిస్ట్ అడగ్గా జగన్ ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం తమను ఏ పార్టీ పొత్తు కోసం సంప్రదించలేదని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదని తనను ఏ పార్టీ సంప్రదించలేదని జగన్ చెప్పారు.


మరి బీజేపీతో భవిష్యత్తులోనైనా పొత్తు పెట్టుకోరుగా అని జర్నలిస్టు అడగ్గా జగన్ మాత్రం దానికి సంబందించిన సమాధానము చెప్పకుండా టాపిక్ మార్చే యత్నం చేశారు. తాము ముందుగానే చెప్పినట్లుగా ప్రత్యేకహోదా ఇచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతాము అని వెల్లడించారు. భవిష్యత్తులో వారి మనసు మారి ఫ్రత్యేకహోదా ఇవ్వచ్చేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జగన్ ఈ వైఖరి చూస్తుంటే రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొనే అవకాశాలు 50-50 అని చెప్పకనే చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: