బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్దాప్యం.. ఇవీ మనిషి జీవితంలోని ప్రధాన దశలు.. కానీ ఇవి ఏ వయస్సులో వస్తాయి.. ఏ దశకు ఏ వయస్సు అనేది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. మనదేశంలో 18 ఏళ్లు దాటితేనే మేజర్ కింద లెక్కవేస్తాం.. 18 ఏళ్లలోపు వారితో జరిపే శృంగారం.. వారి ఇష్టంతోనైనా సరే దాన్ని అత్యాచారం గానే పరిగణిస్తుంది భారత ప్రభుత్వం.

Image result for teenage ROMANCE
ఇటీవలే ఫ్రాన్స్ ఈ విషయంపై తర్జనభర్జన పడింది. లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే చట్టబద్ధ వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయించే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అంటే 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారితో సెక్స్ చేయటాన్ని అక్కడ అత్యాచారంగా పరిగణిస్తారన్నమాట. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఫ్రాన్స్ లింగ సమానత్వ శాఖ సహాయ మంత్రి మార్లీన్ షియాపా రంగం సిద్ధం చేశారు. 


ఫ్రాన్స్ సరే.. మిగిలిన దేశాల సంగతీ ఓసారి చూద్దాం.. సెక్స్‌కు అంగీకారం తెలిపే చట్టబద్ధమైన వయసు విషయంలో యూరప్ దేశాల్లో వేర్వేరు చట్టాలున్నాయి.. ఆస్ట్రియా, జర్మనీ, హంగరీ, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో ఈ వయస్సును కేవలం 14 సంవత్సరాలకే పరిమితం చేశారు.

Related image
గ్రీస్ పోలండ్, స్వీడన్ లలో ఈ వయస్సు 15 ఏళ్లుగా ఉంది. బ్రిటన్,  బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, రష్యాల్లో ఇది 16 ఏళ్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: