ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2017-18 మొదటి 10  నెలల కాలంలో భారత బాంకింగ్ మేజర్ "స్టేట్ బ్యంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)- భారతీయ స్టేట్ బంక్" దేశవ్యాప్తంగా 41.16 లక్షల ఖాతాలు రద్దు చేసింది. ఖాతాదార్లు బ్యాంకు "నిర్దేశిత కనీస నిల్వ" (మినిమం బాలన్స్) ను నిర్వహించకపోవడమే ఇందుకు కారణం.  మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ "సమాచార హక్కు చట్టం - ఆర్‌టీఐ"  కింద రద్దు చేసిన ఖాతాలపై సమాచారం కోరినప్పుడు, ఎస్బీఐ అధికారి ఒకరు లేఖద్వారా వివరాలు వెల్లడించారు. మినిమం బాలన్స్ లేనపుడు విధించే చార్జీలను 75 % వరకు తగ్గిస్తూ ఈ బాంకింగ్ మేజర్ నిర్ణయం తీసుకున్న రోజే నివేదిక బహిర్గతం కావడం గమనార్హం. 
sbi minimum balance penalty charges కోసం చిత్ర ఫలితం
బ్యాంకు ప్రస్తుత నిర్ణయం ప్రకారం మహానగరాలు (మెట్రో) పట్టణాలు (అర్బన్) కేంద్రాల్లో ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నిల్వలను నిర్వహించనట్లయితే విధించే చార్జీలను నెలకు రూ.50 ప్లస్ జీఎస్టీ నుంచి రూ.15 ప్లస్ జీఎస్టీకి తగ్గించింది. ఇక సెమీ-అర్బన్, గ్రామీణ కేంద్రాల్లో చార్జీలను నెలకు రూ.40 ప్లస్ జీఎస్‌టీ నుంచి, రూ.12 ప్లస్ జీఎస్‌టీ మరియు రూ.10 ప్లస్ జీఎస్టీకి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 
sbi latest minimum balance & penalty charges కోసం చిత్ర ఫలితం
ప్రస్తుత నిర్దేశిత మినిమం బాలన్స్ మెట్రో నగరాల్లో ₹ 3000/-, అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ₹ 2000/-, గ్రామీణ ప్రాంతాల్లో ₹ 1000/-. ఈ మినిమం బాలన్సులు ఖాతాలో నిర్వహించక పోతేనే పై పీనల్ చార్జెస్ వర్తిస్థాయి. ఆరు సంవత్సరాల నుండి ఎస్బీఐ "నెలవారీ సగటు బ్యాలన్స్ - మంత్లి యావరేజ్ బాలన్స్ (ఎం ఏ బి) చార్జీలను, 2017 ఏప్రిల్ 1నుంచి అమలు పరుస్తోంది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బ్యాంకు వెనక్కి తగ్గింది.

రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎం.డి పి.కె. గుప్త మంగళవారం మాట్లాడుతూ "మా కస్టమర్ల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే కస్టమర్లు రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి "బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బీఎస్‌బీడీ"  ఖాతాకు మారే వెసులుబాటు కల్పించాం. ఇందులో ఏ విధమైన చార్జీల విధింపు ఉండదు" అన్నారు.


sbi minimum balance penalty charges కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: