లోకేష్ గురించి చెప్పమంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ మంది నాయకులూ ఒక్క మాటలో పప్పు అని సంభోదిస్తుంటారు. ప్రజలకు కూడా లోకేష్ సామార్ధ్యాల మీద అంతగా నమ్మకం లేదని చెప్పవచ్చు. ఇప్పటికి తన సత్తా ను చూపించ లేక
పోతున్నాడు. ఇప్పటికే మంత్రి పదివి ని తన తండ్రి కట్టబెట్టిన దానికి సరైన న్యాయం చేయలేక పోతున్నాడు. అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అయ్యి ఉన్న పరువును పోగొట్టుకుంటున్నాడు.
Image result for lokesh
ప్ర‌త్యేక‌ హోదా కోసం ఏపీ అంతా అట్టుడుకుతుంటే,భావిత‌రాల‌కు కావాల్సిన నాయ‌కుడు నారా లోకేశ్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందిచ‌లేదు.క‌నీసం బ‌య‌టికొస్తే ఎక్క‌డ ప్ర‌శ్నిస్తారో అన్న భ‌యంతోనే ఆయ‌న మీడియాకు కూడా ముఖం చాటేశార‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టు మిత్రులే చ‌ర్చించుకునేంత స్థాయికి చేరుకున్నారు యువ‌మంత్రి చిన‌బాబు గారు. తెలుగుదేశం పార్టీలో కీల‌కం అని చెప్పుకునే నాయ‌కులంతా ప్ర‌త్యేక హోదా గురించి అవ‌కాశం దొర‌క‌బుచ్చుకుని మ‌రీ బీజేపీపై,కేంద్ర‌ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతుంటే, లోకేశ్ మాత్రం కంటికి క‌న‌ప‌డ‌కుండా పోవ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.
Image result for lokesh and ktr
భ‌విష్య‌త్తులో చంద్ర‌బాబు నాయుడు కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టి సారించాలంటే రాష్ట్రంలో లోకేశ్ బ‌లం పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఏపీలో లోకేశ్ బాబు ప‌రిస్థితి ఇలా ఉంటే, తెలంగాణకు సంబంధించి యువ‌మంత్రి కేటీఆర్ మాత్రం దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో సీఎం త‌ర్వాత స్థానం కేటీఆరే అనేంత‌గా జోరుమీదున్నారు.రాష్ట్రంలో ఏ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌యినా, దాన్ని ప‌రిష్క‌రించేందుకు,ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించేందుకు త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. ఇక‌నుంచైనా లోకేశ్ ప్ర‌త్యేక‌హోదాపై పెద‌వి విప్పాల‌ని,పోరాటంలో ముందు నిల‌వాల‌ని కోరుకుందాం.చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు అవ్వాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: