పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో గుంటూరు సమీపంలో ఇల్లు కట్టబోతున్నాడన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భూమికి సంభిందించి ఒక ఆసక్తి కరమైన న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యానణ్ కు గుంటూరు-మంగళగిరి ప్రాంతంలోని కాజా దగ్గర రెండు ఎకరాల స్థలం జస్ట్ నలభై లక్షలకు, మరో నలభై వేలు రిజిస్ట్రేషన్ ఖర్చులకు దొరికేసింది.
Image result for pavan kalyan janasena
ఇప్పుడు ఇదే విషయం సోషల్  మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా ఫేస్ బుక్ లో చలామణీ అవుతున్నాయి. మరి ఆడాక్యుమెంట్లు నిజమైనవే అయితే పవన్ కేవలం నలభై లక్షలకు రెండు ఎకరాల స్థలం సంపాదించినట్లు. ఇంత కారు చౌకగా పవన్ కు స్థలం ఎందుకు ఇచ్చేసినట్లు? అన్న ప్రశ్న కనుక వస్తే, అసలు ఎవరు ఇచ్చారు అన్న ప్రశ్న కూడా వస్తుంది.
Image result for pavan kalyan janasena
అలా ఇచ్చింది రాజధాని ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని కుటుంబానికి చెందిన ఎల్ ఇ పి ఎల్ స్మార్ట్ సిటీ ప్రయివేట్ లిమిటెడ్. ఈ సంస్థ అనగానే జనాలకు చాలా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా కృష్ణానది కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన భారీ గెస్ట్ హవుస్. ఆ గెస్ట్ హవుస్  కు కృష్ణానదితో ప్రయివేట్ జెట్టీ మాదిరిగా అనుసంధానం. ఈ గెస్ట్ హవుస్ నే ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసం అయింది. ఏ ప్రభుత్వం అయితే అక్రమ కట్టడాన్ని కూల్చాలో, అదే ప్రభుత్వం దాన్ని లీజుకు తీసుకుంది. ఇంకేముంది ఖేల్ ఖతమ్. అలాంటి భారీ పలుకుబడి వున్న సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ రెండు ఎకరాలను కారు చౌకగా కొనేసారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: