ప్రపంచంలో ఎలియన్స్ ఉన్నాయి..అంటూ తన పరిశోదనలుతో ఎన్నో నిజాలు బయట పెట్టిన గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) ఇకలేరు. చనిపోయినట్లుగా నిర్ధారించిన ఆయన కుటుంబ సభ్యులు. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు.
Professor Hawking’s insights shaped modern cosmology and inspired global audiences in the millions.
మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు.
Stephen Hawking
అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు.  ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు.
Related image
ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ... కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
Image result for Stephen Hawking family
బ్లాక్ హోల్స్ పై ఆయన చేసిన పరిశోధనలు అనిర్వచనీయం.  మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: