సాధారణంగా మనిషి చిత్ర విచిత్రమైన రూపాల్లో జన్మిస్తుంటారు.  అయితే ఇవి జన్యూపరమైన లోపం అని డాక్టర్లు, శాస్త్రవేత్తలు అంటారు.  ఏనాడో చేసిన పాపానికి ఈ జన్మ ఫలితం అని దేవున్ని నమ్మేవారు అంటారు.  ఏది ఏమైన సమాజంలో కొన్ని సార్లు ఇలాంటి వికృతరూపం ఉన్నవారు ఎన్నో సమస్యలు ఎదుదుర్కొంటారు.  తాజాగా ఓ వ్యక్తికి కాళ్లు ఉండాల్సిన చోట చేతులు, చేతులు ఉండాల్సిన చోట కాళ్లు ఉండటం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.  దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

అబ్దుల్లా అనే వ్యక్తి ఈ ఫోటోను తొలిసారిగా పోస్టు చేశాడు. మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవుడు అతనికి శిక్ష వేశాడని, దాని ఫలితమే ఇలా జరిగిందని ఓ కామెంట్ ను కూడా రాశాడు.  దీంతో అందరూ నిజంగా దేవుడు విధించిన శిక్ష అయి ఉంటుందని భావించారు.  అయితే ఈ మద్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు గా క్రియేట్ చేసే టెక్నాలజీ పెరిగింది..అయితే ఈ ఫోటో కూడా అలాంటిదే అని కొంత మంది కొట్టి పడేస్తున్నారు. 

మరికొంత మంది ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి? ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారా? వంటి విషయాలను పట్టించుకోకుండా షేర్ చేస్తున్నారు.  అయితే అసలు విషయం తెలిస్తే..నిజంగా నవ్వుకుంటారు. ఈ చిత్రంలో ఉన్నది నైజీరియా నటుడు ముకాయిలా. ఓ సినిమా కోసం అతనిలా మేకప్ చేసుకున్నాడట.  మనోడికి ఓ వింత ఆలోచన వచ్చింది..జనాలకు వినూత్నంగా కనిపిస్తే ఎలా ఉంటుందని..అందుకే ఫోటో షేర్ చేశాడు. కానీ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని ఎవరూ చేయరని మరోసారి రుజువైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: