తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో కొనసాగుతున్నా.. 2001 లో దాన్ని తీవ్ర తరం చేసిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుంది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సభ్యుల తీరు అలాగే ఉంది. ఇక తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పరిమిషన్ కావాలి. మూకుమ్మడి రాజీనామాలు చేయవొచ్చు కదా..దానికి మళ్లీ ఢిల్లీ పరిమిషన్ ఎందుకూ..? ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 
Image result for telangana assembly
గవర్నర్ స్పీచ్ లో ఏ ఒక్కటీ అవాస్తవం లేదు. తెలంగాణ లో జరుగుతుంది ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఏ అంశం కూడా అసత్యం లేదు. ఉద్యమాలను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారుల్ని బలిగొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులపై మొసలి కన్నీరు కారుస్తుంది కాంగ్రెస్.
Image result for telangana assembly komatireddy
జానా, చిన్నారెడ్డిలు పదవులు రాగానే ఉద్యమాన్ని పక్కనబెట్టింది వాస్తవం కాదా..! వైఎస్, జీవన్ రెడ్డి కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. దానం, అంజన్, రేణుకా చౌదరి..ఇలా అందరూ కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు.
Related image
సభలో దాడి ఘటనలో మరో ఇద్దరు సభ్యులు..ఫుటేజ్ లో కనబడుతున్నాయి. పరిమితికి లోబడి నిరసనలు తెలియజేస్తే హర్షణీయం..మేం పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తున్నాం అన్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: