గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం మూటగట్టుకున్న తరువాత జగన్ తీవ్ర నిరాశకు లోనయ్యాడని మనం చెప్పవచ్చు. అయితే గత సంవత్సరం చివర్లో జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మేయర్ ఎన్నికలలో ఓడిపోవడం మరింత నిరాశను కలిగించింది. ఎన్నికల్లో ఓడిపోవడమనేది అటుంచుతే పార్టీలో ఫిరాయింపులు జరగడం అనేది జగన్ కు ఒక తలనొప్పిగా మారింది.


ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై జగన్‌ రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. ప్రస్తుతం గుంటూరులో పాదయత్ర చేస్తున్న ఆయనకు ఒక వార్త అదృష్ట రీతిగా కలిసొచ్చింది. ఫిరాయించిన 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాకపోతే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈ పిటిషన్‌ హైకోర్టులో దాఖలుచేశారు. ఎంతోకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పోరాడుతున్న జగన్ కు కూడా ఈ విజయం ఒక అదృష్టంగా కలిగింది.


రాంబాబు వేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యేలతో పాటూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు పంపాలని సూచించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఆ 22 మంది మాత్రం ఈ కేసు ముగిసేలోపు ఎన్నికలు కూడా వస్తాయి అనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఏదిఏమయినా కేసు త్వరగా ముగిసిపోతే చట్టపరంగా అనర్హత వేటు పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: