ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు తెలంగాణలో ఓటు హక్కు ఉన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.  ఈ నేపథ్యంలో వారికి అక్కడే ఓటు హక్కు ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం అమరావతికి మకాం మార్చిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన ఓటు హక్కును కూడా ఏపీకి మార్చుకున్నారు. 
 బాబుతోపాటు ఫ్యామిలీ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ చేసుకున్నారు.  ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లితో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు కూడా చేసుకుంది. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు.
Image result for cm chandrababu family
చంద్రబాబు నివాసం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఈ మేరకు దరఖాస్తు చేసుకోగా.. అధికారులు దర్యాప్తు చేసిన అనంతరం ధృవీకరించారు.  2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు హైదరాబాద్‌లోనే తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.

ఆ మద్య ప్రతిపక్ష నేతలు ‘ఓటు హక్కు లేనోళ్లు కూడా ఇక్కడి సమస్యలపై మాట్లాడాతారా?' అని గతంలో ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శభాష్ లోకేష్.. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కు సాధించావ్' అని చురకలంటిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో తమకు ఓటు హక్కు ఉందని నిరూపించడానికి ఇప్పుడు రూట్ క్లీయర్ అయినట్టే అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: