ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కమలం పువ్వు వాడిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ స్థానాల్లో బీజేపీ కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచిన గోరఖ్‌పూర్‌లో సమాజ్వాదీ పార్టీ జెండా ఎగరేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని... ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషద్ కైవసం చేసుకున్నారు.
samajwadi party
ముఖ్యంగా, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మౌర్య ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఫుల్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి 59613 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో కూడా బీజేపీ అభ్యర్థి బాగా వెనుకబడింది. ఇకపోతే, బీహార్ రాష్ట్రంలో అరారియా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది.
Image result for rjd
ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ అభ్యర్థి 57538 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.   అలాగే, బీహార్‌లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ భాబువా స్థానాన్ని తిరిగి దక్కించుకోగా, జెహానా బాద్ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు.

మొత్తంమీద ఈ ఉప ఫలితాలు బీజేపీకి కోలుకోలేని దెబ్బలా పరిణమించాయి. మరోవైపు  గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో ఎస్పీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్లు రంగులు చల్లుకుంటూ మిఠాయిలు పంచుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: