ఈ రోజు గుంటూరు లో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి వెలాదిగా అభిమానులు కదలి వచ్చారు.  ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే..సభకు చేరుకునే అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకు రావడంతో...క్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు.

జన సేన ఆవిర్భావ దినోత్సవ మహాసభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు,అభిమానులు పోటెత్తడంతో సభ ప్రారంభానికి ముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనాలు ఒక్కసారే వేధికవైపు రావడంతో గొడవ మొదలైంది.

ఇదే క్రమంలో సభ కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఒక అభిమానిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయిన ఆ అభిమానిని వాలంటీర్ల తక్షణ వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు. 

మొత్తం పదిమంది వరకు గాయపడగా వారిలో ఒక యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ దాడిలో గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: