ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ్యుడు వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి రహాస్యంగా ప్రధానిమంత్రి మోడీని కలవడానికి సిద్ధమయ్యారు. వైసిపి అధినేత జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో పోరాడుతుంటే.ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ప్రధానిని రహస్యంగా కలవడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం అధికార పార్టీ తెలుగుదేశానికి తెలియడంతో...కేసులు మాఫీ చేసుకోవడానికి వెళుతున్నారని ఆరోపించారు.


మాములుగా ఆయన అక్కడికి వెళ్తే ఎవరిమి ఇబ్బంది లేదు. కానీ ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. మూడో కంటికి తెలియకుండా ప్రధానిని కలిసేందుకు అక్కడ వేచి చూస్తున్నారు. అయితే అనుకోకుండా అక్కడకు వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధుల కంట పడింది. ఇంకేముంది విజయసాయి మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ప్రధాని మోదీని కలిసేందుకే విజయసాయిరెడ్డి యత్నించారు. ప్రధాని ఆఫీస్ దగ్గర ఉన్న విలేకరులను చూసి ఆయన బయటకు వెళ్లిపోయారు...అని ఈ విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. బీజేపీతో వైసీపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని అంటుంది.


అయితే ఈ క్రమంలో కొందరు సీనియర్ రాజకీయ నాయకులు రాజ్యసభ్యత్వం ఉన్న వారు ఎవ్వరైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని అంటున్నారు. దానికి మీడియాకి చెప్పవలసిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీలో జగన్ తర్వాత స్థానంలో అన్ని కార్యక్రమాలను చక్కపెట్టె పనిలో ఉండే విజయసాయిరెడ్డి ప్రధానిని కలవడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: