జనసేన మంగళగిరి నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధానంగా లోకేశ్ అవినీతిపై చెలరేగిపోయారు. ఏపీ రాజకీయాల్లో లోకేశ్ అవినీతి గురించిన ప్రస్తావన ఇదే తొలిసారి కాదు. వైసీపీ అనేక సార్లు లోకేశ్ అవినీతి గురించి ప్రస్తావించింది. ఎన్నో విమర్శలు చేసింది. 

Image result for lokesh

కానీ ఇంతవరకూ వైసీపీ కూడా టచ్ చేయని కోణాన్ని పవన్ కల్యాణ్ టచ్ చేశారు. కొన్నాళ్ల క్రితం చెన్నైలో టీటీడీ అప్పటి సభ్యులు శేఖర్ రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ దాడులు నిర్వహించింది. కోట్ల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం చేసుకుంది. అయితే ఆ స్కామ్ కూడా నారా లోకేశ్ కూ సంబంధం ఉందట. దీనికి సంబంధించిన ఆధారాలు మోడీ దగ్గర ఉన్నాయట. 

Image result for sekhar reddy cbi

ఈ విషయం మోడీ వరకూ వెళ్లడం వల్లనే ఆయన చంద్రబాబుకు అపాయిట్ మెంట్ ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ మంగళగిరి సభలో లోకేశ్ పేరు పెట్టి ప్రస్తావించారు. అయితే ఈ కోణాన్ని ఇంతవరకూ వైసీపీ కూడా టచ్ చేయలేదు. మరి ఈ వార్తలో ఎంతవరకూ వాస్తవం ఉందో తెలియదు.



పవన్ కల్యాణ్ కూడా ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో నాకు కూడా తెలియదంటూనే విమర్శలు చేశారు. ఇక ఈ విషయాన్ని ఇప్పుడు వైసీపీ అందుకుందనటంలో సందేహం లేదు. దాంతోనైనా విషయం ఏమైనా ఉంటే బయటకు వస్తుంది కదా. చూద్దాం.. ఇంకెన్ని విషయాలు బయటకువస్తాయో..!



మరింత సమాచారం తెలుసుకోండి: