ఈ మద్య బ్యాంకింగ్ రంగం అంతా అనేక అవినీతి అక్రమాలతో నిండిపోయింది. ముఖ్యంగా నీరవ్ మోడీ ప్రధాన పాత్రధారిగా జరిగిన అవినీతి సుమారు ₹ 12700 కోట్లు దీనికి బలైంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీనితో సహా పది బ్యాంకులు సమస్యల్లో ఇరుక్కుపోయాయి. వ్యవస్థ పై భారత జాతి క్రమంగా విశ్వాసం కోల్పోయింది. ఇక్కడ బ్యాంకింగ్ విధానాలలో ఉన్న రంద్రాల ద్వారా బ్యాంక్ అధికారుల కక్కుర్తిని సంత్రుప్తి పరచి ఆర్ధిక నేరస్తుడు ఒక బలమైన ఆర్ధిక వ్యవస్థని దోచేశాడు.

banks are robbed by nirav modi etc white coller offenders కోసం చిత్ర ఫలితం

బాంక్ ఆఫ్ ఇండియా నాయకత్వం లోని దాదాపు 10 బాంకుల కన్షార్షియం ను విక్రం కొఠారి మరియు ఆయన కుటుంబ సభ్యులు రోటోమాక్ కంపనీ అధినేత సుమారు ₹ 4000 కోట్లకు ముంచారు.  

vikram kothari rotomac family కోసం చిత్ర ఫలితం

అంతకు ముందు విజయ్ మాల్యా ప్రధాన పాత్రధారిగా జరిగిన సుమారు ₹ 10000 కోట్ల వరకు అవినీతిలో ఇండియన్ బ్యాంకింగ్ మేజర్, బారతీయ స్టేట్ బ్యాంక్ నాయకత్వంలోని కొన్ని బ్యాంకులు అవినీతి దోపిడీ కూపంలోకి నెట్టివేయబడ్డాయి. ఇక్కడ కీర్తి కాంత కనకాలను ఎలవేసి రాజకీయ నాయకులను, బ్యాంకు అధికారులను వసపరుచుకున్నాడు నేరస్థుడు.  

vijay mallya with his calender girls కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ చెందిన మాజీ డైరెక్టర్ అనూప్ పారెఖ్ గార్గ్ పాత్రధారిగా వదోదరా సాందేశారా కుటుంబ సభ్యుల గ్రూపుకు చెందిన "స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్" అనే కంపనీకి ₹ 5000 కోట్ల వరకు ఋణాలు మంజూరు చేయటంలో భాధ్యత వహించారు. అవినీతి కూపంలో మునిగిన ఆ కంపనీ నేడు ఆంధ్ర బ్యాంక్ నట్టేట ముంచేసింది. ఆయనపై ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడి) పాత్రధారిగా గుర్తించి సప్లిమెంటరి ప్రొసెక్యూషన్ అంటే సప్లిమెంటరి చార్జ్-షీట్ విడుదల చేసింది. అనూప్ పారెఖ్ ను ఈ నెల 9వ తారీఖున నిర్భంధంలోకి తీసుకున్నారు. 

సంబంధిత చిత్రం

ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ తన విచారణలో ఈ ఋణం పొందటానికి సాందేశారా గ్రూపు ₹1.52 కోట్లు 'క్విడ్-ప్రొ-క్వొ' గా అనూప్ పారెఖ్ గార్గ్ కు చెల్లించినట్లు గుర్తించింది. జనవరి పన్నెండున అనూప్ పరేఖ్ గార్గ్ ను జుడీషియల్ కష్టడీకి పంపించింది సి బి ఐ  న్యాయస్థానం  అంతేకాదు ఈడి ఆయన ₹ 1.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు కూడా చేసింది. ఇక్కడ నేరగాడు ఒక బ్యాంకు అధికారి అంతకు మించి ఒక డైరెక్టరుగా విధి విధానాలను నియంత్రించే చోట స్థిరపడి బ్యాంకును అతి స్వల్ప డబ్బు కక్కుర్తికి అమ్మేశాడు. ఇదంతా 2011లో ఆదాయశాఖ అధికారులు సీజ్ చేసిన డైరీలోని ఎంట్రీలు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ అనూప్ పారెఖ్ గార్గ్ కు ₹1.50 కోట్లు ముట్టచెప్పినట్లు అధారాలు లభించాయి. గుజరాత్ లోని ఒక ఫార్మా తయారీ కంపెనీ ఐన ఈ స్టెర్లింగ్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న వదోదరాలోని ఆంధ్రాబ్యాంక్ ను నిలువునా ముంచేసింది.
nithin sandesara family కోసం చిత్ర ఫలితం 
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన టెక్నో-మ్యాక్ అనే కంపెనీ రూ.6000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాక ఈ కేసులు నమోదు చేసింది. ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీపై రూ.2,175 కోట్ల పన్నుతో పాటు, మరో రూ. 2167 కోట్లు వివిధ బ్యాంకులకు ఎగవేసింది. ఇదిలా ఉంటే విద్యుత్ శాఖకు 20 కోట్ల వరకు ఆ సంస్థ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నట్టు తెలుస్తోంది. 

Indian Technomac Company Limited Directors కోసం చిత్ర ఫలితం

ఇలాంటి చిన్న, పెద్ద మొత్తం కలిపి సుమారు రూ.6వేల కోట్లకు ఎగనామం పెట్టారు కంపెనీ నిర్వాహకులు. 2009 కంటే ముందే స్థాపించిన ఈ కంపెనీ తప్పుడు పత్రాలు చూపించి సేల్స్‌-ట్యాక్స్‌ మినహాయింపు పొందింది. దీంతో 2009 నుంచి 2014 వరకు సేల్స్‌-ట్యాక్స్‌ను చెల్లించలేదు. ఆ తర్వాత కంపెనీ వాణిజ్య కార్యక్రమాలను నిలిపి వేసింది. పన్ను మినహాయింపు కోసం పెట్టిన దొంగ నివేదికలనే పలు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడానికి కూడా వాడింది.
nitin sandesara family కోసం చిత్ర ఫలితం
దాదాపు 16 బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకొంది. దీంతో ఎక్సైజ్‌ శాఖ మజ్ర పోలీస్‌స్టేషన్‌ లో సెక్షన్‌ 420, 487, 468, 470, 471ల కింద కంపెనీ ఛైర్మన్‌ రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, రంజన్‌ మోహన్‌, అశ్విన్‌ సాహూలపై కేసులు నమోదు చేసింది.
 banks are robbed by nirav modi etc white coller offenders కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, అనూప్ పరేఖ్ గార్గ్, నితిన్  సాందేశారా, రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ ఉదంతాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్యాంకులకు, తాజాగా టెక్నో మ్యాక్ రుణాల ఎగవేత పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
 సంబంధిత చిత్రం
    

మరింత సమాచారం తెలుసుకోండి: