తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఐదవ బడ్జెట్‌ను ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో  ప్రవేశపెట్టారు. వరుసగా ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తనపై నమ్మకముంచి ఈ కర్తవ్యాన్ని తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపాడు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలనే సీఎం ఆకాంక్ష నెరవేరేలా బడ్జెట్‌ రూపొందించామని ఆయన చెప్పారు.


బడ్జెట్ అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే రూ.లక్షా 74 వేల 45౩కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.లక్షా 25వేల 454 కోట్లు కాగా, రెవెన్యూ మిగులు రూ. 5 వేల 520 కోట్లుగా ఉంది. క్యాపిటల్ వ్యయం రూ. 33,369 కోట్లు కాగా  కేంద్రం వాటా రూ.29 వేల కోట్లుగా  పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన తరువాత ప్రతియేడు జీడీపీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తుందని ఆయన చెప్పారు. ఈ వార్షిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు  ఆయన తెలిపారు. ఇది దేశ జీడీపీ రేటుతో పోలిస్తే గణనీయమని ఆయన అభివర్ణించాడు. కాగా ఈ బడ్జెట్ ను వచ్చే ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా కేసీఆర్ రూపొందించినట్లు తెలుస్తుంది.


తెలంగాణ 2018 -19 బడ్జెట్ కేటాయింపుల హైలైట్స్   
* వ్యవసాయ రంగానికి  రూ.12,667 కోట్లు 
* మహిళా,శిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
* నీటి పారుదల రంగానికి రూ.25,000  కోట్లు
* విద్యుత్‌ రంగానికి రూ. 5560 కోట్లు 
* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.15,563 కోట్లు
* విద్యకు రూ. 2800 కోట్లు 
* కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు
* ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.9693 కోట్లు
* చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు 
* రెండు పడకగదుల ఇళ్లకు రూ.2643కోట్లు
* వైద్య ఆరోగ్యశాఖకు రూ.7375 కోట్లు
* పోలీసు శాఖకు రూ. 5800 కోట్లు 
* జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు
* న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు 
* మైనార్టీ సంక్షేమానికి రూ.2000 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ.1286 కోట్లు   


మరింత సమాచారం తెలుసుకోండి: